NTV Telugu Site icon

Parliament: రాజ్యసభ ఛైర్మన్‌ను హేళన చేసిన విపక్ష ఎంపీ.. వీడియో తీసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi

పార్లమెంట్ భద్రతా లోపంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. భారీ గందరగోళం మధ్య మంగళవారం పార్లమెంటు ఉభయ సభలకు చెందిన 78 ఏంపీలను సస్పెండ్ చేశారు. ఇందులో 33 మంది లోక్‌సభ, 45 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. లోక్‌సభ, రాజ్యసభల నుంచి విపక్ష ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించారు. దీంతో పార్లమెంట్ వెలుపల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read: Police Restrictions: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు

ఈ క్రమంలో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ హేళన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో విపక్ష ఎంపీ రాజ్యసభ ఛైర్మన్‌ని హేళన చేస్తుండగా.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దాన్ని వీడియో తీయడం చర్చనీయాంశమైంది. అంతేకాదు అదే సమయంతో విపక్ష సభ్యులు నవ్వులు కురిపించారు. అయితే పార్లమెంటు వెలుపల తనపై మిమిక్రీ చేస్తూ హేళణ చేసిన చేసిన టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ మండిపడ్డారు.

Also Read: Play Store Settlement: గూగుల్ సంచలన నిర్ణయం.. వినియోదారులకు రూ. 5200 కోట్లు చెల్లింపు..!

ఎంపీ స్థానంలో ఉండి ఛైర్మన్‌ని హేళన చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. మరోవైపు విపక్షాల చర్యను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా ఖండించారు. కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేయాలని పిలుపునిచ్చారు. సభ గౌరవ మర్యాదలను కాపాడకుండా, సభాధ్యక్షునిపై హేళనగా ప్రవర్తించిన ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరారు. ఇదిలా ఉంటే కళ్యాణ్ బెనర్జీ హేళన చేస్తుండగా ఆ దృశ్యాలను రాహుల్‌ గాంధీ ఫోన్‌లో చిత్రీకరించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.