Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్టోబర్ 31న సైన్యంలో కలిసి చైనా సరిహద్దుల్లో దీపావళి వేడుకులు జరుపుకోనున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో భారత్-చైనా సరిహద్దుల్లో ఉన్న సైనికులతో కలిసి పండగ చేసుకోనున్నారు. ఇటీవల సమయాల్లో అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ప్రాంతం చైనా, ఇండియా మధ్య ఘర్షణ పాయింట్లలో ఒకటిగా ఉంది. అరుణాచల్‌ని తమ భూమి అని చైనా క్లెయిమ్ చేస్తుంది. ఇది టిబెల్‌లో భాగమని వాదిస్తోంది. అయితే, ఎప్పటికప్పుడు భారత్ ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూనే ఉంది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అవిభాజ్య భాగమని చెప్పింది.
Read Also: Noida: బీఎండబ్ల్యూ కారులో వచ్చి.. పూల కుండీ దొంగిలించిన మహిళ (వీడియో)
ముఖ్యంగా తవాంగ్ ప్రాంతంలో సరిహద్దుల్లోనే యాంగ్ట్సే వంటి ప్రాంతాల్లో డిసెంబర్ 2022లో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ పడ్డాయి. ఈ ఘటనలో చైనా సైన్యాన్ని భారత సైనికులు చొరబడకుండా అడ్డుకున్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఇరు దేశాలు కూడా చర్చిస్తున్నాయి. ఇదిలా ఉంటే, రాజ్‌నాథ్ సింగ్ పర్యటనకు ముందు అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, ఉపముఖ్యమంత్రి చౌనా మెయిన్ కూడా అక్టోబర్ 30న తవాంగ్ చేరుకుని భారత వైమానిక దళం ఉత్తరాఖండ్ వార్ మోమోరియల్ కార్ ర్యాలీకి స్వాగతం పలుకుతారు.