Site icon NTV Telugu

Rajnath Singh: ‘‘అలా జరిగితే పాకిస్తాన్ 4 భాగాలుగా విడిపోయేది’’..

Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘1971లో మన భారత నేవీ పాకిస్తాన్ రెండుగా విభజించింది, ఆపరేషన్ సిందూర్‌లో నావికాదళం తన పూర్తి బలాన్ని ప్రదర్శించి ఉంటే, పాకిస్తాన్ ఇప్పటికే రెండు కాదు, నాలుగు భాగాలుగా విడిపోయేది’’ అని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్ సిందూర్ కేవలం వార్మ్-అప్ మాత్రమే అని పాకిస్తాన్‌ని హెచ్చరించారు. పాక్ ఏదైనా మళ్లీ దుశ్చర్యకు పాల్పడితే, ఈసారి నేవీ కూడా రంగంలోకి దిగుతుందని, అప్పుడు పాకిస్తాన్‌కి ఏం జరుగుతుందో దేవుడికే తెలుసని ఆయన అన్నారు.

Read Also: PM Modi: పాకిస్తాన్ వైమానిక స్థావరాలను నిమిషాల్లో నాశనం చేశాం..

ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇండియన్ నేవీ చాలా వేగంగా, నిర్ణయాత్మకంగా స్పందించిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన 96 గంటల్లోనే సముద్రంలో మన బలగాలు మోహరించాయని, సర్ఫేజ్ టూ సర్ఫేజ, సర్ఫేజ్ టూ ఎయిర్ మిస్సైళ్లను విజయవంతంగా పరీక్షించామని చెప్పారు. సుదూర లక్ష్యాలను ఖచ్చితత్వంతో దాడులు చేయడం భారతదేశ సంకల్పం, సంసిద్ధతకు స్పష్టమైన సంకేతం అని, ఇది పాకిస్తాన్‌ని రక్షణాత్మక వైఖరిలోకి నెట్టిందని అన్నారు.

Exit mobile version