NTV Telugu Site icon

Rajinikanth: ఇది తమిళ శక్తి.. “సెంగోల్”పై కీలక వ్యాఖ్యలు.. ప్రధానికి ధన్యవాదాలు..

Rajinikanth

Rajinikanth

Rajinikanth: అధికారమార్పిడికి గుర్తుగా ఉపయోగించే చారిత్రత్మక రాజదండం ‘సెంగోల్’ను కొత్త పార్లమెంట్ భవనంలోని స్పీకర్ పోడియం వద్ద ప్రతిష్టించబోతున్నారు. తమిళ సంప్రాదాయానికి చెందిన ఈ సెంగోల్ కు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీటవేసింది. ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ సందర్భంగా ఈ రోజు తమిళ ఆధీనం పూజారులు సెంగోల్ ను ప్రధాని నరేంద్రమోడీకి వేదమంత్రాల ఆశిర్వచనంతో అందచేశారు. చెన్నై నుంచి ఈ రోజ ఢిల్లీకి బయలుదేరిని పూజారులు ప్రధాని నివాసంలో సెంగోల్ ను అందించారు.

Read Also: Sengol: రాజదండాన్ని ప్రధాని మోడీకి అందించిన ఆధీనం పూజారులు

ఇదిలా ఉంటే తమిళ సాంప్రదాయ చిహ్నానికి భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. తమిళ శక్తి యొక్క సాంప్రదాయ చిహ్నం- రాజదండం(సెంగోల్), భారతదేశ కొత్త పార్లమెంట్ భవనంలో ప్రకాశిస్తుంది. తమిళులు గర్వపడేలా చేసిన ప్రధాని నరేంద్రమోడీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రజినీ కాంత్ ట్వీట్ చేశారు.

రేపు ఉదయం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ తో పాటు టీఎంసీ, ఆప్, ఎన్సీపీ, జేడీయూ వంటి 20 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. రాష్ట్రపతితో ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ బహిష్కరణకు పిలుపునిచ్చాయి. మరో 25 పార్టీలు మాత్రం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతామని ప్రకటించాయి.