Rajasthan Train Blast: రైల్వే ట్రాక్ బాంబ్ బ్లాస్ట్.. పాక్ ఏజెంట్‌తో లవ్, పేలుడుకు యువతి కుట్ర..
- రాజస్థాన్ శ్రీ గంగా నగర్ రైల్వే ట్రాక్ పేలుడు కేసులో ట్విస్ట్..
- 21 ఏళ్ల మహిళ, ఆమె సహచరుడి అరెస్ట్..
- పాక్ ఐఎస్ఐ ఏజెంట్‌తో ప్రేమ సంబంధంపై అనుమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Train Blast: రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై బాంబ్ పేలిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి 21 ఏళ్ల యువతి మహక్దీర్ కౌర్, ఆమె సహచరుడు 23 ఏళ్ల దేవేంద్ర సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్ల ప్రేమ సంబంధం కారణంగా యువతి ఈ టెర్రర్ నెట్‌వర్క్‌లో చేరారనే అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడుకు పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తుల ప్రమేయం, నిధులు, ఇతరుల పాత్రపై భద్రతా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి.
నవంబర్ 3న శ్రీగంగానగర్ జిల్లాలోని అనూప్‌గఢ్–సూరత్‌గఢ్ రైల్వే మార్గంలో ఈ పేలుడు సంభవించింది. రాజస్థాన్ ఏటీఎస్, శ్రీగంగానగర్ పోలీసులు, పంజాబ్ పోలీసులు ఈ ఘటనపై సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్ గురుదాస్‌పూర్‌కు చెందిన మహక్దీర్ కౌర్, దేవేంద్ర సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పేలుడులో యువతికి దేవేంద్ర సింగ్ సహకరించినట్లు అనుమానిస్తున్నారు.
Also Read
- Janjatiya Gaurav Diwas: గిరిజనులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. జన్‌జాతీయ గౌరవ్ దివస్‌లో ప్రధాని మోడీ విమర్శలు
- UP Assembly Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా రావు.. ఎస్పీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
- Artist Srinivasan Dies: శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసిన తొలి చిత్రకారుడు మృతి!
- Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
ఐఎస్ఐ ఏజెంట్‌తో ప్రేమ..
విచారణలో.. మహక్దీర్ కౌర్‌కు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్లతో పరిచయం ఉన్నట్లు తేలింది. షా, చాచా అనే కోడ్ పేర్లు కలిగినవారితో పరిచయం ఏర్పడిందని, నిందితురాలు వీరితో సంభాషణలు జరిపినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. ఒక ఐఎస్ఐ ఏజెంట్‌తో మహక్దీప్ ప్రేమ సంబంధంలో ఉందని, దీనిని ఆసరాగా చేసుకుని ఆమెను ఈ నెట్‌వర్క్‌లోకి లాగినట్లు అనుమానిస్తున్నారు. ఆమె భర్త ప్రస్తుతం డ్రగ్స్ కేసులోల జైలులో ఉన్నాడు. భర్త నుంచి విడిపోయి ఉంటున్న మహక్దీప్ ఒంటరితనాన్ని ఉపయోగించుకుని టార్గెట్ చేసిరా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
గతంలో రాజస్థాన్‌లో గంగాపూర్ సిటీలో జరిగిన మరో కేసులో ఈమెకు సంబంధం ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో బబిత అనే మహిళను యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ఏటీఎస్) అరెస్ట్ చేసింది. పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తులతో ప్రేమ సంబంధం ద్వారా ఆమె పరిచయం పెంచుకున్నట్లు అప్పట్లో దర్యాప్తు అధికారులు తేల్చారు. ఈ రెండు కేసుల్లో ఒకే తరహా విధానాన్ని టెర్రర్ నెట్వర్క్ అమలు చేస్తుందా? అని భద్రతా సంస్థలు విచారణ చేపట్టాయి.
పిస్టళ్లు, తూటాలు స్వాధీనం..
మహక్దీప్ కౌర్ వద్ద నుంచి రెండు విదేశీ పిస్టళ్లు, 46 లైవ్ కార్ట్రిడ్జ్లు స్వాధీనం చేసుకున్నట్లు రాజస్థాన్ ATS వెల్లడించింది. అలాగే రూ.30 వేల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే ట్రాక్‌పై పేలుడు ఆపరేషన్ నిర్వహించేందుకు ఈ డబ్బు ఇచ్చి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
Rajasthan Train Blast: రైల్వే ట్రాక్ బాంబ్ బ్లాస్ట్.. పాక్ ఏజెంట్‌తో లవ్, పేలుడుకు యువతి కుట్ర..
-
Big Rain Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన..
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
Kove 650RR: 650cc స్పోర్ట్స్ బైక్‌లో ఫ్రంట్, రియర్ కెమెరాలు.. 108.7hp పవర్‌తో Kove 650RR ఎంట్రీ
ట్రెండింగ్
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!
-
Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్లోనే చెత్త వన్డే సిరీస్!
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..