వరకట్న పిశాచికి మరొకరు బలి అయ్యారు. ఒక లెక్చరర్.. కుమార్తెతో సహా సజీవదహనం అయింది. ఈ ఘోర విషాద ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
సంజు బిష్ణోయ్… జోధ్‌పూర్ జిల్లాలో లెక్చరర్‌గా పని చేస్తోంది. అయితే ఇంట్లో నిత్యం భర్త, అత్తమామలు వరకట్నం కోసం వేధిస్తున్నారు. ఈ వేధింపులు రోజురోజుకు మరింత తీవ్రం కావడంతో విసుగెత్తిపోయింది. దీంతో మూడేళ్ల కుమార్తె యశస్వితో కలిసి పెట్రోల్ పోసుకుని సజీవదహనం అయ్యారరు. ఘటనాస్థలిలోనే కుమార్తె ప్రాణాలు వదలగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంజు శనివారం మృతిచెందింది.
ఇది కూడా చదవండి: Upasana : హోదా కాదు, కీర్తి కాదు.. నన్ను నేను నిలబెట్టిన శక్తి ఇదే
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. భర్త, అత్తమామల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది.
శుక్రవారం మధ్యాహ్నం సంజు పాఠశాల నుంచి ఇంటికి వచ్చింది. డాంగియావాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్నాడ గ్రామంలో ఇంట్లో కుమార్తెతో కుర్చీపై కూర్చుని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇంట్లో భర్త, అత్తమామలు లేరని చెప్పారు. ఇంట్లో నుంచి పొగలు రావడంతో ఇరుగుపొరుగు వారు గమనించి పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. సంఘటనాస్థలికి చేరుకునే సమయానికి రక్షించేందుకు అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. ఇక పోస్టుమార్టం తర్వాత మృతదేహాలపై బాధితురాలి తల్లిదండ్రులు-అత్తమామల మధ్య ఘర్షణ తలెత్తింది. చివరికి బాధితురాలి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో దహన సంస్కరాలు ముగించారు.
ఇది కూడా చదవండి: Mirabai Chanu: గోల్డ్ మెడల్ కొట్టిన మీరాబాయి చాను!
జోధ్‌పూర్ జిల్లాలోని ఫిట్కాస్ని గ్రామానికి చెందిన బాధిత మహిళా తల్లిదండ్రులు.. అల్లుడు దిలీప్ బిష్ణోయ్, అతని తల్లి, తండ్రిపై ఫిర్యాదు చేశారు. వారి వేధింపులు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. దీంతో భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) బృందం సహాయంతో పోలీసులు సంఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. సూసైడ్ నోట్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్లో భర్త, అత్తగారు, మామగారు, వదిన వేధించారని ఆరోపించింది. గణపత్ సింగ్ అనే వ్యక్తిపై కూడా వేధింపుల ఆరోపణలు చేసింది. గణపత్ సింగ్‌తో కలిసి మహిళను భర్త శారీరకంగా వేధించినట్లు గుర్తించారు.