Site icon NTV Telugu

Mumbai: 20 ఏళ్ల తర్వాత సరికొత్త చరిత్ర.. ఒకే వేదిక పంచుకున్న థాక్రే బ్రదర్స్

Mumbai

Mumbai

మహారాష్ట్ర రాజకీయాల్లో నూతన అధ్యయనం వెలుగుచూసింది. దాయాదులుగా ఉన్న అన్నాదమ్ముళ్లిద్దరూ 20 సంవత్సరాల తర్వాత ఒక్కటయ్యారు. మరాఠీ భాష కోసం ఒకే వేదిక పంచుకున్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లోనే ఇది సరికొత్త చరిత్రగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

ఇది కూడా చదవండి: 2025 Bajaj Dominar 400: బజాజ్ నుంచి స్పోర్ట్స్ టూరింగ్ బైక్ సిరీస్ విడుదల.. ధర ఎంతంటే?

మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం 1-5 తరగతుల్లో హిందీని తప్పనిచేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై విపక్ష పార్టీలన్నీ భగ్గుమన్నాయి. బలవంతంగా హిందీ రుద్దడమేంటి? అని నిలదీశాయి. తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జూన్ 17న హిందీని ఐచ్ఛిక భాషగా చేస్తూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సవరించింది.

ఇది కూడా చదవండి: Bhumana Karunakar Reddy: జగన్‌ను చూస్తేనే కూటమి నేతలకు భయం.. అందుకే అడ్డుకునే ప్రయత్నం..!

ఇక మరాఠీ భాష కోసం థాక్రే బ్రదర్స్ ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే నడుం బిగించాయి. అమ్మలాంటి మరాఠీ భాషను రక్షించుకుంటామంటూ నినదించారు. ఇందులో భాగంగా శనివారం ‘మరాఠీ విజయ్ దివాస్’ పేరుతో భారీ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఆందోళనకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అంతేకాకుండా 20 ఏళ్ల తర్వాత అన్నాదమ్ములిద్దరూ కలవడంపై సర్వత్రా ఆసక్తి చోటుచేసుకుంది. స్థానిక మీడియాతో పాటు జాతీయ మీడియాలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఇక విడిపోవడానికి కలవలేదని.. కలిసి ఉండడానికి కలిశామంటూ ఉద్ధవ్ థాక్రే అన్నారు. ముంబై మున్సిపల్ ఎన్నికల కోసమే కలిశారంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధమని.. తాము కలిసి పోరాడానికే కలిశామని… కలిసే మరాఠీ భాష కొట్లాడతామని వెల్లడించారు. అయినా కొందరు మమ్మల్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తారని వ్యాఖ్యానించారు.

ఇక విభజన సృష్టించే ప్రయత్నాలను తాము ఐక్యంగా ఎదుర్కొంటామని రాజ్ థాక్రే తెలిపారు. బాలాసాహెబ్ థాక్రే వల్ల కానిది.. ఫడ్నవిస్ పుణ్యమా? అంటూ ఉద్ధవ్‌ను తనను కలిపారంటూ వ్యాఖ్యానించారు.

 

Exit mobile version