Raised On Streets Of Patna, 8-Year-Old Boy Now Set To Board US Flight: బీహార్ పాట్నా వీధుల్లో పెరిగిన ఓ 8 ఏళ్ల అనాథ బాలుడు.. ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లబోతున్నాడు. ఈ ఘటన మనుషుల్లో మానవత్వం, మంచితనం ఇంకా మిగిలి ఉందని చెప్పే ఘటన. పాట్నాకు చెందిన అనాథ బాలుడు అర్జిత్ స్టోరీ ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి. అమెరికాకు చెందిన ఓ జంట ఈ అనాథ బాలుడిని దత్తత తీసుకున్నారు. వీరు ఇప్పుడు తమతో పాటు అర్జిత్ ను అమెరికా తీసుకెళ్లబోతున్నారు.
మూడేళ్ల క్రితం పాట్నాలోని బిహ్తా ప్రాంతంలో విపరీతమైన చలిలో తిరిగిన ఓ పిల్లాడు ఇప్పుడు యూఎస్ఏ డాక్టర్ జంటతో కలిసి ఖండాంతరాలు దాటనున్నాడు. స్పెషల్లీ ఎబుల్డ్ అనాథ అయిన అర్జిత్ కు మంచి వైద్యం కూడా అందించనున్నారు. పాట్నా నుంచి దత్తత తీసుకున్న కుమారుడితో తిరిగి వెళ్తామని ఇందుకు అవసరమైన పత్రాలను ఇప్పటికే పూర్తి చేశామని డాక్టర్ దంపతులు కల్నెల్ మిల్లర్, కాథ్లీన్ మిల్లర్ వెల్లడించారు. యూఎస్ లో అత్యాధునిక చికిత్స అందిస్తామని అన్నారు. పిల్లాడికి సంబంధించి పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గుర్తింపు పత్రాలు సిద్ధం అయిన వెంటనే అర్జిత్ ను తమ వెంట తీసుకెళ్లనున్నారు.
Read Also: Team India: టీమిండియాకు షాక్.. బంగ్లాదేశ్ టూర్‌కు స్టార్ బౌలర్ దూరం
మేము పిల్లలను ప్రేమిస్తామని.. దత్తత తీసుకోవడం సుదీర్ఘ ప్రక్రియ అని.. కానీ చివరగా ఓ కొడుకు రావడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని వారు అన్నారు. ఈ జంట ఇప్పటి వరకు నలుగురిని దత్తత తీసుకుంటే ఇందులో అర్జిత్ ఒకరు. మేము అర్జిత్ కు అత్యుత్తమ జీవితం, సంరక్షణ అందిచాలని అనుకుంటున్నామని ఈ జంట తెలిపారు. మేము ఇప్పటికే వైద్యులతో మాట్లాడామని.. అమెరికాకు వెళ్లిన తర్వాత అర్జిత్ కు శస్త్రచికిత్స చేయిస్తామని వెల్లడించారు.
దీనిపై పాట్నాలోని దానాపూర్ ఎస్డీఎం ప్రదీప్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. విదేశీ మంత్రిత్వ శాఖలో పిల్లాడి కోసం పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారని.. అది అందిన వెంటనే వారు అమెరికా తిరిగి వెళ్లారని.. దత్తత తీసుకోవడానికి అవసరమైన అన్ని డాక్యుమెంటేషన్, పత్రాలను పూర్తి చేశారని అన్నారు.