తమిళనాడులో 16 జిల్లాల్లో రెడ్ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తమిళనాడులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల వల్ల రోడ్లన్నీ జలమయమ య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన 16 జిల్లాల్లో కడలూరు, విల్లుపురం, చెంగల్‌పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరుతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇక పెరంబలూరు, అరియలూరు, ధర్మపురి, తిరప త్తూరు, వెల్లూరు, రాణిపేట్‌లలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ (ఐఎండి) వెల్లడించింది.
ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉన్న తుఫాను మరో 12 గంటల్లో అల్పపీడ నంగా మారే అవకాశముందని ఐఎండి హెచ్చరించింది. ఈ అల్ప పీడనం వల్ల కుంధాలం (తిరప్పూర్)లో గరిష్టంగా 20.సెం.మీ, ధర పురం (తిరప్పూర్ జిల్లా) 13 సెం.మీ, తంజావూర్, తిరుప్పూర్ కలె క్టరేట్ క్యాంప్ ఆఫీస్ (తిరుప్పూర్ జిల్లా) పందలూరు (నీలగ్రిస్ జిల్లా) 12 సెం.మీ మేర వర్షం కురిసినట్లు చెన్నై వాతావరణ శాఖ తెలిపింది.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
చెన్నై నగరంలోనూ, శివారు ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. తంబారం, మైలాపూర్, వేలచ్చేరి, అంబత్తూరు, సూదాపేట, క్రోమ్ పేట, రాయపేట, ప్యారీస్, ఏకత్తుతంగల్, కొత్తూరుపురం, అడయార్ మెరీనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెంగల్‌పేట్, తిరువళ్లూరు, కాంచీపురంలో జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) రెండు బృందాలుగా ఏర్పడి సహాయక చర్యలు చేపట్టింది.
తాజావార్తలు
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: ప్రేమించిన అమ్మాయినే చంపేశాడు.. లవ్ స్టోరీలో ఇంత షాకింగ్ ట్విస్ట్ ఏంటి?.. ‘గజ’ టీజర్ అదిరిందిగా!
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!