NTV Telugu Site icon

తమిళనాడులో 16 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తమిళనాడులో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల వల్ల రోడ్లన్నీ జలమయమ య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన 16 జిల్లాల్లో కడలూరు, విల్లుపురం, చెంగల్‌పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరుతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇక పెరంబలూరు, అరియలూరు, ధర్మపురి, తిరప త్తూరు, వెల్లూరు, రాణిపేట్‌లలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ (ఐఎండి) వెల్లడించింది.

ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాలలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉన్న తుఫాను మరో 12 గంటల్లో అల్పపీడ నంగా మారే అవకాశముందని ఐఎండి హెచ్చరించింది. ఈ అల్ప పీడనం వల్ల కుంధాలం (తిరప్పూర్‌)లో గరిష్టంగా 20.సెం.మీ, ధర పురం (తిరప్పూర్‌ జిల్లా) 13 సెం.మీ, తంజావూర్‌, తిరుప్పూర్‌ కలె క్టరేట్‌ క్యాంప్‌ ఆఫీస్‌ (తిరుప్పూర్‌ జిల్లా) పందలూరు (నీలగ్రిస్‌ జిల్లా) 12 సెం.మీ మేర వర్షం కురిసినట్లు చెన్నై వాతావరణ శాఖ తెలిపింది.

చెన్నై నగరంలోనూ, శివారు ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. తంబారం, మైలాపూర్‌, వేలచ్చేరి, అంబత్తూరు, సూదాపేట, క్రోమ్‌ పేట, రాయపేట, ప్యారీస్‌, ఏకత్తుతంగల్‌, కొత్తూరుపురం, అడయార్‌ మెరీనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెంగల్‌పేట్‌, తిరువళ్లూరు, కాంచీపురంలో జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) రెండు బృందాలుగా ఏర్పడి సహాయక చర్యలు చేపట్టింది.