Site icon NTV Telugu

Rahul Gandhi: రాహుల్ గాంధీ ముందు “మోడీ,మోడీ” నినాదాలు.. “ఫ్లయింగ్ కిస్‌”తో సమాధానం..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు అస్సాంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రోజు యాత్రలో పాల్గొన్న తమ కార్యకర్తలపై బీజేపీ శ్రేణులు దాడులు చేశాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ రాష్ట్రంలో నాగోన్‌లో రాహుల్ యాత్ర బస్సు ముందు బీజేపీ కార్యకర్తలు ‘‘జైశ్రీరామ్’’ నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీకి మద్దతుగా ‘‘మోడీ..మోడీ’’ అంటూ నినాదాలు చేశారు.

Read Also: Top 10 richest temples: అయోధ్య రామ మందిరానికి ముందు.. దేశంలో 10 అత్యంత ధనిక దేవాలయాలు ఇవే..

ఈ నినాదాలకు ప్రతిగా రాహుల్ గాంధీ వారికి చేతులు ఊపుతూ.. ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి, వారిని కలుసుకునేందుకు బస్సు దిగి వచ్చారు. ‘‘ మా మొహబ్బత్ కి దుకాన్(ప్రేమ దుకాణం) అందరి కోసం తెరిచి ఉంది. ‘జుడేగా భారత్, జీతేగా హిందూస్తాన్’’ అని రాహుల్ గాంధీ ఎక్స్(ట్విట్టర్)లో వీడియోని పోస్ట్ చేశాడు. అస్సాంలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి గానీ, అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మకు గానీ తాను భయపడటం లేదని అన్నారు. తమ యాత్రలో జైరాం రమేష్‌తో సహా తమ నాయకులను బీజేపీ కార్యకర్తలు లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.

ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ యాత్రలో జైశ్రీరాం, మోడీ నినాదాలతో దద్ధరిల్లినట్లు బీజేపీ పేర్కొంది. అయోధ్యంలో ప్రాణ ప్రతిష్ట(జనవరి 22)లో భాగం కావాలన్న ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించిన తర్వాత, రాబోయే రోజుల్లో అతను దేశ ప్రజల్ని ఎలా ఎదుర్కొంటారు..? అంటూ బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఎక్స్ లో ట్వీట్ చేశారు. కొందరు మోడీకి అనుకూలంగా నినాదాలు చేయడంతో రాహుల్ గాంధీ వారిపై అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు.

Exit mobile version