Rahul Gandhi: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తు్న్నారు. ఆయన శాన్ ఫ్రానిస్కో, న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో పర్యటిస్తు్న్నారు. ఆదివారం న్యూయార్క్ నగరంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్-యూఎస్ఏ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇతర రాష్ట్రాల్లో పునరావృతం అవుతాయని ఆయన అన్నారు. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీని తుడిచిపెడుతామంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదని యావత్ దేశం విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు సిద్ధమైందని అన్నారు. బీజేపీని కర్ణాటకలో తుడిచిపెట్టగలమని నిరూపించామని, మేం బీజేపీ ఓడించలేదని, తుడిచిపెట్టామని అన్నారు.
Read Also: Etela Rajender: తెలంగాణ జాతి ఆకలినైనా భరిస్తుంది.. కానీ ఆత్మగౌరవం కోల్పోదు..
కర్ణాటకలో గెలిచేందుకు బీజేపీ అన్ని శక్తులను ఒడ్డి పోరాడిందని రాహుల్ గాంధీ అన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని వెల్లడించారు. తెలంగాణలో కూడా అదే జరుగుతుందని, రాబోయే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీని గుర్తించడం కష్టమని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది తెలంగాణతో పాటు రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లోనూ బీజేపీలో కనిపించకుండా పోతుందని అన్నారు. బీజేపీ విద్వేష రాజకీయాలతో ముందకెళ్లలేమని దేశ ప్రజలు గుర్తించడమే ఇందుకు కారణమని అన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యమయ్యాని అన్నారు. బీజేపీ విద్వేషపూరిత సిద్ధాంత, కాంగ్రెస్ ప్రేమపూర్వక సిద్ధాంతం ప్రజల ముందున్నాయని వ్యాఖ్యానించారు.