Site icon NTV Telugu

Rahul Gandhi: భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ..

Rahul

Rahul

Rahul Gandhi: భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో శనివారం నాడు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక, పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ గురించి ప్రజలకు తెలియజేయడం చాలా కీలకం అన్నారు. అయితే, మన ముందున్న సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి కృషి అవసరం అని రాహుల్ గాంధీ ఆ లేఖలో పేర్కొన్నారు.

Read Also: Ponnam Prabhbakar : కుల గణన మీద అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం

మరోవైపు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై కూడా ఈ సమావేశాల్లోనే చర్చించాలని తెలిపారు. ప్రత్యేక సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందని నేను నమ్ముతున్నాను అని ఖర్గే చెప్పుకొచ్చారు.

Exit mobile version