బీహార్‌లో బడుగు బలహీనవర్గాల ప్రజల ఓట్లే తొలగించారని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటర్ అధికార్ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ బీహార్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం.. అధికార పార్టీతో కుమ్మక్కై 65 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఇందులో పేదోళ్ల ఓట్లే ఉన్నాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: US: అలాస్కాలో కూలిన ఎఫ్-35 జెట్ విమానం.. భారీగా ఎగిసిపడ్డ మంటలు
ఓట్ల చోరీపై రానున్న రోజుల్లో మరిన్ని ఆధారాలు బయటపెడతానని వెల్లడించారు. గతంలో మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలో కూడా ఓట్ల చోరీ జరిగిందని. ఇప్పుడు బీహార్‌లో కూడా అదే పంథా కొనసాగిస్తున్నారన్నారు. దీన్ని బీహార్ ప్రజలు సహించరని చెప్పారు. దొంగ ఓట్లతోనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించేందుకు ప్రజల ఓటు హక్కును దొంగిలించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇది కూడా చదవండి: Trump-Modi: ట్రంప్ సుంకాలతో వచ్చే నష్టమేంటి? భారత్ ప్లాన్ ఏంటి?
త్వరలోనే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే ఈసీ ప్రత్యేక సర్వే చేపట్టి 65 లక్షల ఓట్లు తొలగించింది. ఈ వ్యవహారమే దుమారం రేపింది. అధికార పార్టీతో ఈసీ కుమ్మక్కై ఓట్ల తొలగిస్తుందంటూ పార్లమెంట్ వేదికగా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇప్పుడు తాజాగా బీహార్‌లో రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. ఆగస్టు 17న మొదలైన యాత్ర.. సెప్టెంబర్ 1న ముగియనుంది.
