Naravane Book: నరవణే బుక్‌పై దుమారం.. రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు

  • నరవణే బుక్‌పై దుమారం
  • రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు
  • అమెజాన్‌లో అందుబాటులో ఉందని వెల్లడి
Rahulgandhi

Rahulgandhi

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసిన ఆత్మకథ పుస్తకం కుదిపేస్తోంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సందర్భంగా జాతీయవాదంపై మాట్లాడుతుండగా రాహుల్ గాంధీ హఠాత్తుగా మనోజ్ నరవణే రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’లోని ఆత్మకథకు సంబంధించిన అంశాలను లేవనెత్తారు. అంతే వెంటనే కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ మైక్ కట్ చేశారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది.

ఇది కూడా చదవండి: Sergio Gor-Piyush Goyal: సుంకాలు జీరో చేసుంటే క్రికెట్ మ్యాచ్ అమెరికానే గెలిచేది.. విందులో గోయల్ నవ్వులు.. పువ్వులు

అయితే ఈ పుస్తకం ప్రచురణకు కేంద్రం నుంచి అనుమతి లభించలేదు. కానీ రాహుల్ గాంధీ చేతిలో కనిపించింది. పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ పుస్తకాన్ని చూపిస్తూ.. కావాలంటే ప్రధాని మోడీకి పంపిస్తానని చెప్పారు. అయితే ఆ పుస్తకం రాహుల్ గాంధీ చేతిలోకి ఎలా వచ్చిందన్న అంశంపై కేంద్రం ఆరా తీస్తోంది. ఢిల్లీ పోలీసులు కూడా దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Plane Crash: అమెరికాలో రోడ్డుపై కూలిన విమానం.. వీడియో వైరల్

అయితే ఈ అంశంపై తాజాగా రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘నా పుస్తకం అందుబాటులో ఉందని మనోజ్ నరవణే ట్వీట్ చేశారు. పుస్తకం ప్రచురణ కాలేదని పబ్లిషర్ పెంగ్విన్ అయినా అబద్దం చెప్పుండాలి… లేదంటే నరవణే అయినా అబద్దం చెప్పుండాలి. నేను అయితే నరవణే ట్వీట్‌ను నమ్ముతున్నాను. పుస్తకం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. పుస్తకంలో భారత ప్రభుత్వానికి.. ప్రధాని మోడీకి అసౌకర్యంగా ప్రకటనలు ఉండొచ్చు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. నరవణే పుస్తకంపై ఎఫ్‌ఐఆర్ బుక్ అయిన తర్వాత ప్రతిపక్ష నేత ఈ వ్యాఖ్యలు చేశారు.

పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఈ పుస్తకంపై ప్రత్యేక ప్రచురణ హక్కులను కలిగి ఉందని.. ప్రింట్ లేదా డిజిటల్ రూపంలో ఎటువంటి కాపీలను ప్రజలకు విడుదల చేయలేదని ఒక ప్రకటనలో పేర్కొంది. “పుస్తకం ప్రచురణలోకి రాలేదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము… ప్రస్తుతం ముద్రణ, డిజిటల్, PDF లేదా ఏదైనా ఇతర ఫార్మాట్‌లో, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో, ఏదైనా ప్లాట్‌ఫామ్‌లో పూర్తిగా లేదా పాక్షికంగా చెలామణిలో ఉన్న పుస్తకం ఏవైనా కాపీలు PRHI కాపీరైట్ ఉల్లంఘనకు కారణమవుతాయి. వెంటనే నిలిపివేయబడాలి” అని ప్రచురణకర్త పేర్కొన్నారు.