NTV Telugu Site icon

Rahul Gandhi: పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ ఎంపీని తోసేసిన రాహుల్ గాంధీ.. తలకు గాయం..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: అమిత్ షా రాజ్యసభ స్పీచ్‌పై పార్లమెంట్ ఆవరణలో పెద్ద ఎత్తున నిరసన జరుగుతోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌కి చెందిన ఎంపీలు అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేస్తోందని, ఎడిటెడ్ వీడియోను ప్రచారం చేస్తోందని, నిజానికి అంబేద్కర్‌ని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీనే అని బీజేపీ ఎదురుదాడికి దిగింది.

Read Also: Poco C75: తక్కువ ధరకే 50MP కెమెరా, 5160mAh బ్యాటరీ.. నేటి నుంచే అమ్మకాలు షురూ..

ఇదిలా ఉంటే, గురువారం పార్లమెంట్ కమర్ దావర్(గేటు) వెలుపల జరిగిన గొడవలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగిని తోసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎంపీ సారంగి తలకు గాయమైన వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే, ఈ ఆరోపణలపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. నిజానికి బీజేపీ ఎంపీల బృందమే తమను తరిమికొట్టి, బెదిరింపులకు పాల్పడిందని, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేను కూడా బెదరించారని రాహుల్ గాంధీ విలేకరులతో అన్నారు. ‘‘నేను లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాను. కానీ బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించాను. వారు నన్ను దూరంగా నెట్టివేసి, బెదిరించారు. తమకు పార్లమెంట్‌లోకి వెళ్లే హక్కు ఉంది’’ అని ఆయన అన్నారు.

తనపైకి ఓ వ్యక్తిని రాహుల్ గాంధీ నెట్టాడని, అతను తనపై పడటంతో తలకు గాయమైనట్లు బీజేపీం ఎంపీ సారంగి చెప్పారు. ‘‘నాపై పడిన ఎంపీని రాహుల్ గాంధీ నెట్టారు. ఆ తర్వాత నేను కింద పడిపోయాను. నేను మెట్ల వద్ద నిలబడి ఉండగా రాహుల్ గాంధీ వచ్చిన నాపైకి ఎంపీని తోసేశాడు.’’ అని ఆయన చెప్పారు. గాయపడిన ఎంపీని అధికారులు ఆస్పత్రికి తరలించారు.

Show comments