Site icon NTV Telugu

Rahul Gandhi: నిరుద్యోగం, ద్రవ్యోల్భనంపై ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పాలి.

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi Questions PM Modi Over High Inflation, Unemployment: కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ను చేపడుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ఈ పాదయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ పలు ప్రశ్నలు సంధించారు. ద్రవ్యోల్భనం 35 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎందుకు చేరింది..? నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి ఎందుకు చేరింది..? పరోటాలపై 18 శాతం జీఎస్టీ ఎందుకు విధిస్తున్నారు..? వ్యవసాయ ట్రాక్టర్ల పై 12 శాతం జీఎస్టీ ఎందుకు విధిస్తున్నారు.? అని ట్విట్టర్ వేదిక ప్రశ్నల వర్షం కురిపించారు. భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది.. ప్రధాన మోదీ, మిమ్మల్ని ఈ ప్రశ్నలు మరిన్ని అడుగుతారు..మీరే సమాధానం చెప్పాలి అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ.

Read Also: Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. డబుల్ బోనస్ బొనంజా

బీజేపీ విభజన రాజకీయాలకు, దేశంలో ద్రవ్యోల్భనం, అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. దీంట్లో భాగంగానే భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. ఇప్పటికే ఈ యాత్ర తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ముగిసింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది.

రాహుల్ గాంధీ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన భాగానే వస్తోంది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారిలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం అయింది. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతుంది. మొత్తంగా 5 నెలల పాటు 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. చివరగా జమ్మూ కాశ్మీర్ లో భారత్ జోడో యాత్ర ముగుస్తుంది.

Exit mobile version