Site icon NTV Telugu

BJP-Congress Poster War: బీజేపీ- కాంగ్రెస్ మధ్య పోస్టర్ వార్.. ప్రధాని మోడీ అలా.. రాహుల్ గాంధీ ఇలా..!

Cng Vs Bjp

Cng Vs Bjp

BJP-Congress Poster War: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆ తర్వాత అమెరికా జోక్యంతో పాక్ తో కాల్పుల విరమణకు భారత్ ఒప్పకోవడంతో ప్రధాని మోడీపై దేశ ప్రజలతో పాటు విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం కొనసాగుతుంది. ఇక, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ముఖాన్ని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తో జత చేసి ‘వన్ అజెండా’ అని రాసిన పోస్టర్‌ను కమలం పార్టీ సమాచార్ శాఖ చీఫ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాహుల్ గాంధీ పాకిస్తాన్ భాషలో మాట్లాడుతున్నారు.. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మాల్వియా ఆరోపించారు.

Read Also: Deputy CM Pawan Kalyan: ఫలించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కృషి.. నేడు రాష్ట్రానికి కుంకీ ఏనుగులు

అలాగే, ఆపరేషన్ సింధూర్‌తో విజయం సాధించిన భారత్ కు, ప్రధాన మంత్రిని రాహుల్ గాంధీ అభినందించలేదు అని అమిత్ మాల్వియా ఆరోపించారు. అభినందనలకు బదులుగా.. మనం ఎన్ని జెట్‌లను కోల్పోయామని పదే పదే అడుగుతాడు.. ఈ ప్రశ్నను ఇప్పటికే DGMO బ్రీఫింగ్‌లలో ప్రస్తావించారు.. యుద్ధ సమయంలో ఎన్ని పాకిస్తానీ జెట్‌లను కాల్చివేసారో తేల్చి చెప్పారని గుర్తు చేశారు. మాల్వియా వ్యాఖ్యలకు బీహార్ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో పోల్చుతూ మరో ఫోటోను విడుదల చేసింది. ఈ ఫోటోకు “ఏక్ బిర్యానీ దేశ్ పర్ భరీ” అని క్యాప్షన్ పెట్టారు.

Exit mobile version