Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- నీట్ పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్
- 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు
- విద్యార్థుల డిమాండ్లు నెరవేర్చాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఇప్పటి వరకు ఎవరికీ శిక్ష పడలేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. నీట్ పేపర్ లీకేజ్‌పై రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ నిరసనలు వీడియో రూపంలో ప్రదర్శించారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా పరిగణించబడిన మన విద్యా వ్యవస్థ, ఇప్పుడు ఒక మోసపూరిత వ్యవస్థగా మారిందన్నారు. గత 10 ఏళ్లలో దేశంలో 152 ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని.. లెక్క వేస్తే దాదాపు ప్రతి నెలా ఒక లీక్ జరుగుతోందని తెలిపారు. 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు దీనివల్ల ప్రభావితమయ్యాయన్నారు. వీరంతా మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందినవారని తెలిపారు. ఈ పరీక్షల ఖర్చు భరించలేనిదన్నారు. ‘‘ప్రతి సంవత్సరం నీట్ కోసం 1.32 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మరోవైపు భారత ప్రభుత్వ విద్యా బడ్జెట్ 1.4 లక్షల కోట్ల రూపాయలు. ప్రభుత్వం తన మొత్తం విద్యా బడ్జెట్‌పై ఖర్చు చేసేంత మొత్తాన్ని ఒక కుటుంబం ఒక్క పరీక్షపై ఖర్చు చేస్తుంది.’’ అని వెల్లడించారు.
విద్యార్థులకు కేవలం మూడు డిమాండ్లు ఉన్నాయి
విద్యార్థులు కేవలం మూడు డిమాండ్లు మాత్రమే చేస్తున్నారని, అవి పూర్తిగా చట్టబద్ధమైనవని, ప్రభుత్వం వాటిని అంగీకరించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మేము ఈ డిమాండ్లకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
1. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
2. విద్యార్థులపై జరిగిన దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ జవాబుదారీగా చేయాలి.
3. ప్రధానమంత్రి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి.
తాజావార్తలు
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!