Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rahul Gandhi Lacks Maturity Congress Unlikely To Progress Under Him Kiren Rijiju

Kiren Rijiju: రాహుల్ గాంధీ హయాంలో కాంగ్రెస్ కష్టమే..

Published Date :November 9, 2024 , 9:45 pm
By BV Reddy
  • రాహుల్ గాంధీ హయాంలో కాంగ్రెస్ ఎప్పటికీ ఎదగదు..
  • అతడికి పరిపక్వత లేదు..
  • కేంద్రమంత్రి కిరణ్ రిజిజు విమర్శలు..
Kiren Rijiju: రాహుల్ గాంధీ హయాంలో కాంగ్రెస్ కష్టమే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kiren Rijiju: రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి, బీజేపీ నేత కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు పూణేలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి పరిపక్వత లేదని, విదేశాల్లో భారత్‌ని నిందించడం కారణంగా ఎవరూ నాయకులు కాలేరని హితవు పలికారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) నకిలీ కథనాలను ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ నేతృత్వంలోని బీజేపీ కూటమి ఎదుర్కొంటుందని, నవంబర్ 20న జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Hamas: గాజాపై దాడి కారణంగానే ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇజ్రాయెలీలపై దాడి

బీజేపీ ప్రజలను ఎప్పుడూ కులాలు, వర్గాల వారీగా విభజించదని రిజిజు చెప్పారు. ఇటీవల నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ రాహుల్ గాంధీ నిర్వహించిన సమావేశంపై రిజిజు విమర్శలు గుప్పించారు. ఖాళీ పేజీలు ఉన్న రాజ్యాంగాన్ని పంపిణీ చేశారని, దీంతో రాహుల్ గాంధీ అసలు స్వరూపం తెలిసిందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో దళితుల్ని కాంగ్రెస్ తప్పుదోవ పట్టించిందని, కానీ అసెంబ్లీ ఈ బూటకపు కథనం పనిచేయదని చెప్పారు. బాబా సాహెబ్ అంబేద్కర్‌ని కాంగ్రెస్ అనేక సార్లు అవమానించిందని చెప్పారు.

“ప్రతిపక్ష నాయకుడిగా (లోక్‌సభలో) రాజ్యాంగబద్ధమైన పదవిని కలిగి ఉన్నందున నేను అతనిని గౌరవిస్తాను, అయితే, రాజకీయ కోణం నుండి, అతను అపరిపక్వతను ప్రదర్శిస్తాడు. కాంగ్రెస్ అతడిని చాలా సార్లు లాంచ్ చేసింది. కానీ ఇప్పటి వరకు అతడికి పరిపక్వత లేదు. విదేశాల్లో భారత్‌ని నిందించి నాయకుడిగా ఎదగలేడు’’అని కేంద్రమంత్రి అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎదిగే అవకాశం లేదని ఎద్దేవా చేశాడు. అందుకే ప్రియాంకా గాంధీని ఎన్నికల్లో పోటీ చేసేలా చేస్తున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కి గాంధీ కుటుంబం ముందుంటుందని, బీజేపీకి దేశం ముందుంటుందని ఆయన అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • Kiren Rijiju
  • Maharashtra elections 2024
  • rahul gandhi

తాజావార్తలు

  • Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions