Rahul Gandhi: సోనియా గాంధీ రాసిన Belonging: A Journey of Love అనే జ్ఞాపకాల పుస్తకావిష్కరణ సోమవారం న్యూఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వివాదానికి కారణమయ్యాయి. రాహుల్ తన తల్లిదండ్రులు రాజీవ్ గాంధీ, సోనియాగాంధీల మధ్య అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “ప్రతి భోజన సమయంలో నాన్న ఉండేవారు. నాన్న ఒడిలో అమ్మ కూర్చునేవారు. ఇదంతా నాకు చాలా సాధారణమైన విషయంగా అనిపించేది” అని రాహుల్ చెప్పారు. ఈ అలవాటు తనకు సహజంగా అనిపించేదని, ఒకసారి తన స్నేహితుడి తల్లి కూడా అతడి నాన్న ఒడిలో ఎందుకు కూర్చోవడం లేదని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు.
రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు..
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అనిర్బన్ గంగూలీ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘సాధారణ ముసుగులో కనిపిస్తున్న సిగ్గులేని ప్రవర్తన’’ అని విమర్శించారు. దేశ ప్రజలకు చెప్పే నిద్రకథలా ప్రతీ భోజన సమయంలో తన తల్లి తండ్రి ఒడిలో కూర్చునేవారని రాహుల్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 55 ఏళ్లకి వ్యక్తి డిన్నర్ టేబుల్‌కు, బహిరంగ వేదికకు మధ్య తేడా తెలియకపోతే, ఒక వేళ ప్రధాని అయినట్లు ఊహించుకుంటే, ప్రధాని కార్యాలయంలోని రహస్య ఫైళ్లను ఏం చేస్తారు? సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కొంతమంది నెటిజన్లు ఇది భారత సంస్కృతికి భిన్నంగా ఉందని అభిప్రాయపడ్డారు. పిల్లల సమక్షంలో తల్లి తండ్రి ఒడిలో కూర్చునే సంస్కృతి భారత్‌లో లేదని కామెంట్ చేస్తున్నారు.
రాహుల్ కౌంటర్ అటాక్..
తన తల్లిదండ్రుల మధ్య ప్రేమానుబంధం గురించి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం స్పందించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతుదారుల మనసుల్లో భయం, కోపం, ద్వేషం ఒక వలలా అల్లుకుపోయాయని, అవి వారిని ప్రేమను అనుభవించకుండా, వ్యక్తపరచకుండా అడ్డుకుంటున్నాయని అన్నారు. నిజమైన హిందువుగా ఈ వల నుంచి వారిని విముక్తి చేయడం నా బాధ్యత అని పరమశివుడు, పార్వతీ దేవి నందిపై కలిసి కూర్చున్న ఫోటోను ఎక్స్‌లో షేర్ చేశారు. ‘‘సత్యం శివం సుందరం’’ అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Fear, anger and hatred have woven a web in the hearts of BJP and RSS supporters that stops them from experiencing and expressing love.
As a true Hindu, it is my duty to free them from this web, so that they too can start to experience the breathtaking beauty and joy of love and belonging in their lives.
Satyam Shivam Sundaram.
— Rahul Gandhi (@RahulGandhi) November 17, 2026
खाना खाने के समय मम्मी पापा की गोद में बैठती थीं
और जब मैं मेरे दोस्तों के घर जाता था और वहां ऐसा नहीं देखता था
तो मैं उन से पूछता था कि तुम्हारी मम्मी तुम्हारे पापा की गोद में बैठ कर खाना क्यों नहीं खा रहीं
….🤣🤣🤣🤣🤣🤣🤣🤣….
#RahulGandhi https://t.co/QcsN6fwLlm— मयंक उपाध्याय ( मोदी योगी के साथ ) 🇮🇳🚩 (@MayankUpqdhyay) November 16, 2026

