Rahul Gandhi: మోదీజీ.. ఇది సినిమా కాదు నిజం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడులు, హత్యల నేపథ్యంలో కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. కశ్మీరీ పండిట్లు 18 రోజులుగా ధర్నా చేస్తుంటే.. బీజేపీ ఎనిమిదేళ్ల పాలన వేడుకల్లో బిజీగా ఉందని ఆరోపించారు. మంగళవారం కుల్గామ్‌లో ఉపాధ్యాయురాలు రజనీ బాలాపై కాల్పులు జరుపడంతో ఆమె మృతి చెందింది.
ఈ క్రమంలో రాహుల్ స్పందించారు. ‘లోయలు శాంతి భద్రతల పరిస్థితిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాని గారూ, ఇది సినిమా కాదు నిజం. కశ్మీర్‌లో గత ఐదు నెలల్లో 15 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. 18 మంది పౌరులు మరణించారు’ అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. మంగళవారం కుల్గామ్‌లో రజనీ బాలాపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
Also Read
పాఠశాల వద్దకు చేరుకున్న రజనీపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అనంతరం ఆమెను స్థానికులు, పాఠశాల సిబ్బంది జిల్లా దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రజనీ భర్త రాజ్‌కుమార్ సైతం ఉపాధ్యాయుడే. ఆయన కశ్మీర్ విభాగంలో పని చేస్తున్నారు. ఈ దంపతులకు 12 కూతురు ఉండగా.. తల్లిదండ్రులతో కలిసి ఆమె లోయలో నివాసం ఉంటోంది.
कश्मीर में पिछले 5 महीनों में 15 सुरक्षाकर्मी शहीद हुए और 18 नागरिकों की हत्या कर दी गयी। कल भी एक शिक्षिका की हत्या कर दी गयी।
18 दिनों से कश्मीरी पंडित धरने पर हैं लेकिन भाजपा 8 साल का जश्न मनाने में व्यस्त है।
प्रधानमंत्री जी, ये कोई फ़िल्म नहीं, आज कश्मीर की सच्चाई है।
— Rahul Gandhi (@RahulGandhi) June 1, 2022
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..