Rahul Gandhi: ఆంగ్ల భాష ఖూనీ.. రాహుల్ గాంధీని విమర్శిస్తూ ప్రొఫెసర్ అక్షర దోషాలు.. వైరల్
- రాహుల్ గాంధీపై విమర్శలు
- పప్పులో కాలేసిన మహిళా ప్రొఫెసర్
- సోషల్ మీడియాలో ఎద్దేవా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని విమర్శించే క్రమంలో ఓ మహిళా ప్రొఫెసర్ పప్పులో కాలేసింది. ఆమె విమర్శలు కంటే.. ఎక్స్‌లో పోస్ట్ చేసిన అక్షర దోషాలు తెగ వైరల్‌గా మారాయి. ఇంగ్లీష్‌లో రెండు పట్టాలు అందుకున్న విద్యావంతురాలు.. ఆమె అక్షర దోషాలు చూసి ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Also Read
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్పితా చటర్జీ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీని విమర్శించింది. తాను ‘అంధభక్తురాలిని’ అని.. అంధభక్తులను రాహుల్ గాంధీ మూర్ఖులుగా అభివర్ణిస్తున్నారని ప్రశ్నించారు. తనకు ఇంగ్లీష్, ఎడ్యుకేషన్‌లో రెండు మాస్టర్స్ డిగ్రీలు ఉన్నాయని, బీఈడీ కూడా పూర్తి చేశానని, ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నానని తెలిపారు. ‘‘‘డియర్ రాహుల్ గాంధీ.. నేను గర్వించదగ్గ అంధభక్తురాలిని. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను. నాకు ఇంగ్లీష్, ఎడ్యుకేషన్‌లో రెండు మాస్టర్స్ డిగ్రీలు ఉన్నాయి. బీఈడీ డిగ్రీ కూడా పూర్తి చేశాను. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నాను. మీ ప్రకారం అంధభక్తుడు ఒక మూర్ఖుడు. మరి నేను మూర్ఖురాలినా? మీకు నిశ్చయంగా తెలుసా?’’ అంటూ అర్పితా చటర్జీ తన పోస్టులో ప్రశ్నించారు.
అయితే రాహుల్ గాంధీని విమర్శించిన దాని కంటే ఆమె పోస్ట్‌లో ఉన్న ఆంగ్లంలో ఉన్న తప్పులపైనే నెటిజన్లు ఎక్కువగా దృష్టి పెట్టారు. దీంతో ఆమె పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె పేర్కొన్న రాజకీయ అంశాల కంటే పోస్టులో ఉపయోగించిన ఇంగ్లీష్ పదాలు, వాక్య నిర్మాణంపై నెటిజన్లు చర్చించారు. ముఖ్యంగా ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వ్యక్తి పోస్టులో పలు వ్యాకరణ తప్పులు ఉండటాన్ని కొందరు ప్రశ్నించారు.
‘‘హేవింగ్ టూ మాస్టర్స్ డిగ్రీ’’ అని రాసిన చోట.. ‘‘హేవింగ్ టూ మాస్టర్స్ డిగ్రీస్’’ అని ఉండాలని పలువురు సూచించారు. అలాగే ‘‘పర్స్యూయింగ్ పీహెచ్డీ’’ అనే పదబంధానికి ముందు ‘‘ఎ’’ అనే ఆర్టికల్ ఉపయోగించి ‘‘పర్స్యూయింగ్ ఎ పీహెచ్డీ’’ అని రాయడం సరైనదని కొందరు వివరించారు. పోస్టులోని పలు వాక్యాలను సరిదిద్దుతూ నెటిజన్లు ప్రత్యామ్నాయ వాక్య నిర్మాణాలను కూడా పంచుకున్నారు.

ఇంగ్లీష్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తి ఇలాంటి ప్రాథమిక వ్యాకరణ తప్పులు చేయడం వ్యంగ్యంగా ఉందని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు సరదాగా స్పందిస్తూ.. రాహుల్ గాంధీపై రాజకీయ విమర్శ చేయడానికి ఉద్దేశించిన పోస్టు చివరకు సోషల్ మీడియాలో ఇంగ్లీష్ గ్రామర్ పాఠంగా మారిపోయిందని పేర్కొన్నారు. దీంతో అర్పితా చటర్జీ పోస్టు రాజకీయ చర్చ కంటే వ్యాకరణంపై జరిగిన వాదనతోనే ఎక్కువగా చర్చనీయాంశమైంది.
Dear @RahulGandhi , I am a proud Andhbhakt and an assistant professor, having two master’s degree(English and Education), having B.Ed. Degree too and pursuing PhD.
According to you an Andhbhakt is an IDIOT.
Am I an IDIOT ! Are you sure ?
— Arpita Chatterjee (@asliarpita) July 29, 2026
తాజావార్తలు
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీలు!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!