NTV Telugu Site icon

Parliament scuffle: ఆ రోజు రాహుల్‌ గాంధీ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్‌లా ప్రవర్తించారు..

Rahul

Rahul

Parliament scuffle: డిసెంబర్ 19న పార్లమెంటు ఆవరణలో ఎంపీల మధ్య తోపులాట జరిగిన ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్‌చంద్ర షడంగీ, ముకేశ్‌ రాజ్‌పూత్‌ గాయపడ్డారు. ఈ ఘటనపై తాజాగా గాయపడిన వారిలో ఒక ఎంపీ షడంగీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్‌ ఆవరణలో తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే.. రాహుల్‌ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్‌లా ప్రవర్తించారని మండిపడ్డారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ లాంటి గొప్ప వ్యక్తులు లోక్‌సభలో విపక్ష నేతలుగా వ్యవహరించారు.. అలాంటి పదవిలో ఉన్న ఆయన ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదన్నారు. ఇక, తోపులాటలో గాయపడిన తాను డిసెంబరు 28వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉంది.. తలపై పడిన కుట్లు ఇంకా మానకపోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని బీజేపీ ఎంపీ ప్రతాప్‌చంద్ర షడంగీ చెప్పారు.

Read Also: Rohit Sharma: రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఆ టెస్టు తర్వాతే రిటైర్మెంట్!

అయితే, లోక్ సభలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్‌ను అమిత్‌షా అవమానించారని విపక్షాలు ఆందోళన చేశాయి. అదే సమయంలో కాంగ్రెస్సే అంబేద్కర్ ను అవమానిస్తోందంటూ మకరద్వారం మెట్లపై నిల్చొని ఎన్డీయే ఎంపీలు నిరసన చేశారు. అప్పుడే, ప్రతిపక్ష ఎంపీలూ ఆందోళన చేస్తున్నారు.. అప్పుడు పక్క నుంచి వెళ్లే ఛాన్స్ ఉన్నా.. మెట్లపై కూర్చున్న తమను తోసుకుంటూ రాహుల్‌ గాంధీ సభలోకి వెళ్లడానికి ట్రై చేశారని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. ఈ దాడిలో బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. ఇక, ఈ ఆరోపణలను రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. తాను సభలోకి వెళ్తుంటే వారే అడ్డుగా వచ్చి నెట్టేశారని చెప్పుకొచ్చాడు.

Show comments