Site icon NTV Telugu

Rahul Gandhi: ఆగస్టు 15న డుమ్మా.. రిపబ్లిక్ డేకు హాజరు.. వేడుకలను వీక్షించిన రాహుల్‌గాంధీ

Rahulgandhi2

Rahulgandhi2

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. గతేడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరు కాకపోవడంతో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన రిపబ్లిక్ డే వేడుకుల్లో పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా పక్కనే రాహుల్ గాంధీ నిలబడి పరేడ్‌ను వీక్షించారు. తెల్లటి టీ-షర్ట్ ధరించిన రాహుల్ గాంధీ కవాతును నిశితంగా గమనిస్తూ కనిపించారు. ఇక ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, యూరోపియన్ కమిషన్‌ చీఫ్ ఉర్సులా వెండెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో డికోస్టా హాజరయ్యారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ సహా పలువురు కేంద్ర మంత్రులు, విఐపీలు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Exit mobile version