Rajiv Gandhi: రాజీవ్ గాంధీ 78వ జయంతి.. నివాళులర్పించిన రాహుల్, ప్రియాంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajiv Gandhi: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాతో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని వీర్‌భూమిలో ఉన్న రాజీవ్ గాంధీ సమాధి వద్ద అంజలి ఘటించారు. ఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీకి నివాళులు అర్పిస్తూ ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, ఎంపీ కేసీ వేణుగోపాల్, రాబర్ట్ వాద్రాతో పాటు తదితరులు పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు, రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ కరోనాతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి ఆమె దూరంగా ఉన్నారు. రాజీవ్ గాంధీ జన్మదినాన్ని ప్రతి ఏటా సద్భావన దినోత్సవంగా నిర్వహిస్తారు.
Delhi | Congress MP Rahul Gandhi, general secretary Priyanka Gandhi Vadra, Robert Vadra, MP KC Venugopal, and LoP Mallikarjun Kharge pay homage to former PM Rajiv Gandhi, on his 78th birth anniversary at Vir Bhumi. pic.twitter.com/Pqoc4YU1hl
Also Read
— ANI (@ANI) August 20, 2022
On his birth anniversary, tributes to our former Prime Minister Shri Rajiv Gandhi.
— Narendra Modi (@narendramodi) August 20, 2022
Monkeypox Test Kit: మొట్టమొదటి స్వదేశీ మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ విడుదల
ఆగస్టు 20, 1944లో ముంబైలో రాజీవ్ గాంధీ జన్మించారు. 1984 అక్టోబరులో ఆయన దేశ ప్రధాని మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అతి పిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి రాజీవ్ గాంధీ సరికొత్త రికార్డు సృష్టించారు. 1989 డిసెంబర్ 2 వరకూ ప్రధానిగా పని చేశారు. కాగా మే 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!