Rahul Gandhi: “అమిత్ షా పోలీసులతో మాట్లాడటం నేను చూశాను”.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
- పేపర్ లీక్ బిల్లు ఆమోదం తర్వాత మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.
- సభలో తనను మాట్లాడనివ్వలేదని ఆరోపణ.
- "అమిత్ షా పోలీసులతో ఫోన్లో మాట్లాడడం చూశాను" అని వ్యాఖ్య.
- విద్యార్థులపై జరిగిన చర్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. యాంటీ-పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభలో సంచలన ఆరోపణలు చేశారు. అమిత్ షా ఆదేశాల మేరకే పోలీసులు విద్యార్థులపై కాల్పులు జరిపారని అన్నారు. అయితే, ఈ ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, రాహుల్ గాంధీ వాదనలు అబద్ధమని బీజేపీ తిప్పికొట్టింది.
ఇదిలా ఉంటే, పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. సభలో తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశాన్ని తనకు నిరాకరించారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడినైన తనను మాట్లాడనివ్వలేదని, సమస్యలు లేవనెత్తడం తన హక్కు అని రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థులకు సంబంధించిన సమస్యలు లేవనెత్తడానికి ప్రయత్నించగా, తన ప్రసంగాన్ని పూర్తి చేయనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
Also Read
- Rahul Gandhi: నా మాటల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పాను.. ‘ఇడియట్స్’ వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ క్లారిటీ
- LPG eKYC: ఎల్పీజీ కేవైసీ అప్డేట్ మెసేజ్ వచ్చిందా..? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి..
- CJP: బీజేపీపై భారీ ఉద్యమం.. ఆప్, కాంగ్రెస్‌లపై మాత్రం కాక్రోచ్ మౌనం.
- Karnataka: షాకింగ్ పరిణామం.. 7 వేల మంది కాలేజీ విద్యార్థులకు ఎయిడ్స్ నిర్ధారణ
మీడియా సమావేశంలో 5 ఫోటోలను చూపిస్తూ, పార్లమెంట్‌కు 500 మీటర్ల దూరంలో భారతీయ యువతపై దాడి జరిగిందని, విద్యార్థులపై జరిగిన చర్యల గురించి తాము హోంమంత్రికి నిరంతరం సమాచారం అందించామని, అమిత్ షా పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడుతుండటం నేను స్వయంగా చూశాను అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. హోం మంత్రికి ఈ విషయం తెలియకపోతే అది చాలా తీవ్రమైన విషయమని, ఒకవేళ తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: నా మాటల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పాను.. ‘ఇడియట్స్’ వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ క్లారిటీ
-
LPG eKYC: ఎల్పీజీ కేవైసీ అప్డేట్ మెసేజ్ వచ్చిందా..? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి..
-
Rahul Gandhi: “అమిత్ షా పోలీసులతో మాట్లాడటం నేను చూశాను”.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ
-
Honor X6e Launched: 7,500mAh బ్యాటరీ, TFT LCD స్క్రీన్, 4GB ర్యామ్+ 128GB స్టోరేజ్ రూ.16 వేలకే..
-
AP Rain Alert: ఏపీకి మరోసారి భారీ వర్షాల హెచ్చరికలు..! జిల్లాల వారీగా తాజా అంచనా
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!