Site icon NTV Telugu

Rahul Gandhi: ప్రధాని అదానీని రక్షిస్తున్నారని స్పష్టం అయింది.

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi accuses PM of protecting Adani: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్లమెంట్ లో ప్రధాని నరేంద్రమోదీ చేసిన స్పీచ్ పై స్పందించారు. ప్రధాని ప్రసంగంతో నేను సంతృప్తి చెందలేదని.. గౌతమ్ అదానీ, ప్రధాని స్నేహితుడు కాకపోతే విచారణ జరపాలని చెప్పి ఉండాల్సిందని.. ఆయన విచారణ గురించి మాట్లాడలేదని అన్నారు. ప్రధాన మంత్రి అదానీని రక్షిస్తున్నారని స్పష్టం అయిందని రాహుల్ గాంధీ విమర్శించారు. నేను అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానం ఇవ్వలేదని అన్నారు. ఢిఫెన్స్ ఇండస్ట్రీలో అదానీ షెల్ కంపెనీలు ఉన్నాయని.. దీనిపై ప్రధాన మంత్రి ఏం చెప్పలేదన్నారు.

READ ALSO:PM Narendra Modi: ప్రజలు చేయలేనిది ఈడీ చేసింది.. కాశ్మీర్‌లో ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతాకం

అంతకుముందు ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ లో మాట్లాడుతున్న సమయంలో, స్పీచ్ మధ్యలో రాహుల్ గాంధీ సభకు హాజరయ్యారు. నిన్న పార్లమెంట్ లో జరిగన తన ప్రసంగంలోని కొన్ని భాగాలను ఎందుకు రికార్డుల నుంచి తొలగించారని ప్రశ్నించారు. మంగళవారం తాను లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని జవాబు చెప్పడంలో విఫలం అయ్యారని చెప్పారు.

మంగళవారం పార్లమెంట్ లో బీజేపీ, ప్రధాన మంత్రిపై విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. అదానీ వ్యవహారంలో మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యానికి మోదీ ప్రభుత్వం సహాయం చేస్తోందని.. కాంట్రాక్టుల కోసం కొన్ని నిబంధనలు కూడా మార్చారని విమర్శించారు. ఎయిర్ పోర్టుల కాంట్రాక్టులను అనుభవం లేని అదానీకి అప్పగిస్తున్నారని, ఇలాగే డిఫెన్స్ రంగంలో కూడా అదానీ కంపెనీలు చేరాయని, వీటన్నింటికి ప్రధాని నరేంద్ర మోదీతో ఉన్న స్నేహమే కారణం అని రాహుల్ గాంధీ విమర్శించారు.

Exit mobile version