Kolkata: పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హత్యాచార ఘటన వ్యవహారంలో రాష్ట్ర సర్కార్ వైఖరిని నిరసిస్తూ.. జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటితో (శుక్రవారం) ఆరో రోజుకు చేరుకుంది. కాగా, ఈ దీక్షలో పాల్గొన్న వైద్యుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని హస్పటల్ కి చెందిన అధికారులు తెలిపారు.
Read Also: Bhatti Vikramarka: ప్రభుత్వ పాఠశాలలకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుంది..
కాగా, కొందరు ట్రైనీ వైద్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్టోబర్ 5 నుంచి ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. వారిలో ఒకరైన అనికేత్ మహతో ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తుంది. దీంతో గురువారం రాత్రి అతడిని హస్పటల్ కి తరలించి ట్రిట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ వైద్యుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అనికేత్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడానికి ఐదుగురు సభ్యులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. ఇక్కడే, నిరాహార దీక్షలో పాల్గొన్న మరో ఆరుగురు డాక్టర్లు ఆరోగ్యం కూడా క్షీణిస్తున్నట్లు ట్రైనీ వైద్యులు పేర్కొన్నారు. వారికి వెంటనే వైద్యం అందించడానికి దీక్ష ప్రాంతంలో ఐసీయూ అంబులెన్స్, ఇతర వైద్య పరికరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
Read Also: Jagadish Reddy: రేవంత్ రెడ్డికి బతుకమ్మ పాట వింటే వణుకు పుడుతుంది..
ఇక, తమ డిమాండ్లను బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పరిష్కరించే వరకు తమ నిరాహార దీక్ష కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు తెలిపారు. ఈ దీక్షలో పాల్గొన్న వైద్యుల్లో ఎవరికి ఏం జరిగినా దానికి మమతా సర్కార్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అలాగే, నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లు కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వైద్యుల ఆరోగ్య పరిస్థితిపై సీనియర్ వైద్యులు ఆందోళన చేస్తున్నారు. ఈ యువ వైద్యులే మన భవిష్యత్తు.. వీరు న్యాయం కోసం దీక్ష చేస్తున్నా.. ఈ ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.