NTV Telugu Site icon

Bihar: పానీపూరి విషయంలో అత్త-కోడలు మధ్య గొడవ.. చివరికి ఏమైందంటే..?

Panipuri

Panipuri

పానీపూరి అంటే ముఖ్యంగా చిన్న పిల్లలకు చాలా ఇష్టం. దానిని లొట్టలేసుకుని తింటుంటారు. అంతేకాకుండా.. సరిపోకుంటే ఇంటికి పార్శిల్ తెచ్చుకుని మరీ తింటారు. అయితే.. ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు పానీపూరీని తింటున్నారు. గల్లీలో ఇటు చివర.. అటు చివర దర్శనమిస్తాయి. అయితే.. అదే పానీపూరి ఓ అత్త కోడలు మధ్య గొడవకు కారణమైంది. అసలు విషయానికొస్తే.. పానీపూరీలు తీసుకొచ్చిన భర్త తన కంటే ముందే తల్లికి పెట్టాడని భార్యకు కోపం వచ్చింది. దీంతో.. రాత్రంతా రోడ్డుపైనే హైవోల్టేజీ డ్రామా నడిచింది. ఆ మహిళ భాగల్‌పూర్‌లోని జీరో మైల్‌ లో ఉంటున్న తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసింది. ఇంతలో అక్కడికి వచ్చిన తన పేరెంట్స్ పై భర్త సుధాన్షు రాయ్, అతని సోదరుడు హిమాన్షు, ఇతర కుటుంబ సభ్యులు తిరగబడ్డారు. కర్రలతో చితకబాదారు.

Afghanistan In Semis : అఫ్గానిస్తాన్ కెప్టెన్ కు విదేశాంగ మంత్రి ఫోన్‌.. వీడియో వైరల్..

ఈ ఘటన సోమవారం రాత్రి జగత్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ విషయం పోలీసుల వరకు చేరినా మంగళవారం సాయంత్రం వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. జగత్‌పూర్‌కు చెందిన సుధాన్షు రాయ్, సప్నా కుమారికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే.. భార్య సప్నా ఇప్పుడు మాట మారుస్తుందని భర్త చెబుతున్నాడు. అప్పుడు పానీపూరీ కోసం పెద్ద తతంగం చేసి.. ఇప్పుడు ఏసీ గురించి కథలు చెబుతుందని భర్త వాపోయాడు. ఏసీ కోసం తన భర్త, అత్తగారు తరచూ డబ్బులు అడుగుతారని ఆమె చెప్పింది. దానికి నిరాకరించడంతో ఎప్పటికీ కొట్టేవాళ్లని.. అంతేకాకుండా మానసికంగా, శారీరకంగా హింసించే వారని చెప్పింది.

Drug Quality Test: పారాసెటమాల్‌తో సహా 52 డ్రగ్స్ నమూనాలు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్..

మరోవైపు.. తన భార్య తన తల్లికి సేవ చేయడం ఇష్టం లేదని, ఆస్తిని ఎప్పుడు పంచుకోవాలని అనేదని భర్త చెప్పాడు. అయితే.. ఈ ఘటనపై డయల్ 112లో ఫిర్యాదు అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని శాంతింపజేశారు. పానీపూరిపై మొదలైన వివాదం ఇంట్లో గొడవలకు దారితీసిందని పోలీసులు తెలిపారు. మహిళా హెల్ప్ డెస్క్ ద్వారా ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చేందుకు కృషి చేస్తున్నామని.. ఎవరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని ఇన్ చార్జి పోలీస్ స్టేషన్ ఇంచార్జి సందీప్ కుమార్ ఆనంద్ తెలిపారు.