NTV Telugu Site icon

QR code scam: రామమందిరం పేరిట భక్తుల్ని లూటీ చేస్తున్న “క్యూఆర్ కోడ్ స్కామ్”.. వీహెచ్‌పీ వార్నింగ్..

Ram Mandir

Ram Mandir

QR code scam: రామమందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. జనవరి 22, 2024న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఈ మహత్తర ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే అదనుగా కొందరు భక్తుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహా రామాలయ సంప్రోక్షణకు కొన్ని వారాలే సమయం ఉండగా.. భక్తులను మోసం చేస్తూ, వారి నుంచి నకిలీ విరాళాలు సేకరిస్తున్న రాకెట్ వెలుగులోకి వచ్చింది. దీనిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థ ‘విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కోరింది. ఈ మోసానికి గురికావద్దని ప్రజలను కోరుతూ.. సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీ చేసింది.

వీహెచ్‌పీ ప్రతినిధి వినోద్ బన్సాల్ ట్వీట్ చేస్తూ.. “శ్రీ రామ జన్మభూమి తీర్థ ఛేత్రా అయోధ్య, ఉత్తరప్రదేశ్” పేరుతో ఒక నకిలీ సోషల్ మీడియా పేజీని సృష్టించినట్లు వెల్లడించారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన పేజీని, రామ మందిర నిర్మాణం పేరుతో నిధులనున అందించమని భక్తుల్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ మోసం గురించి ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులకు వెల్లడించారు.

Read Also: New Year 2024: న్యూఇయర్‌లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్‌, కిరిబాటి.. ఏ దేశంలో ఎప్పుడంటే?

రామాలయం పేరుతో విరాళాలనున కోరిన వ్యక్తి, మీకు చేతనైనంత విరాళం ఇవ్వాల్సిందిగా కోరడంతో పాటు విరాళం ఇచ్చిన వారి పేర్లు డైరీలో నమోదు చేసుకుని, ఆలయం పూర్తైన తర్వాత అయోధ్యకు ఆహ్వానిస్తానని నమ్మబలుకుతున్నారు. అంతే కాకుండా ‘‘ ముస్లిం సమాజం, హిందూ సమాజానికి మధ్య పోరాటం జరుగుతోందని తెలుసు, ఆలయాన్ని నిర్మించేందుకు అనుమతించడం లేదని, అందుకే తమ ఆలయం కోసం నిధులు సేకరిస్తున్నాం’’ అంటూ మోసగాళ్లు ప్రజల్ని లూటీ చేస్తున్నారు. రామ మందిరం పేరులో ప్రజల మధ్య విభేదాలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

రామమందిరం పేరిట నిధులు సేకరించేందుకు ఎవరికీ అధికారం లేదని, ప్రజలు ఇలాంటి మోసాలకు గురికావద్దని వీహెచ్‌పి చెప్పింది. దీనిపై ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ డీజీపీ, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కి లేఖ రాసినట్లు తెలిపింది.