Site icon NTV Telugu

Putin India Visit: ‘‘చమురు, S-400, Su-57 జెట్స్ ’’.. పుతిన్ పర్యటనలో కీలక అంశాలు..

Modi Putin

Modi Putin

Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. పుతిన్ పర్యటనపై రష్యా, భారత్ రెండు దేశాలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ముఖ్యంగా, రెండు దేశాల మధ్య రక్షణ, ఇంధనం, ఉక్రెయిన్ యుద్ధం అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం ఆయన 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. గత సంవత్సరం మాస్కోలో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతాయని భారత్ చెప్పింది.

భారత ప్రధాని నరేంద్రమోడీ, పుతిన్ మధ్య శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి. ఈ పర్యటన చాలా ముఖ్యమని, రెండు దేశాల మధ్య సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం రష్యన్ – భారత్ సంబంధాలను మరింత పెంచుతాయని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. స్టేట్ విజిట్ కు వస్తున్న పుతిన్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికి, ఆయన గౌరవార్థం విందును ఏర్పాటు చేస్తారు. చివరిసారిగా పుతిన్ ఉక్రెయిన్ యుద్ధానికి ముందు 2021లో భారత్‌లో పర్యటించారు.

Read Also: Maulana Mahmood Madani: ముస్లింలను అవమానిస్తున్నారు.. “జిహాద్‌”పై జమియత్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

ఆపరేషన్ సిందూర్ సమయంలో రష్యన్ తయారీ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సమర్థవంతంగా పనిచేశాయి. భారత్ మరిన్ని యూనిట్లను రష్యా నుంచి కొనుగోలు చేయాలని చూస్తోంది. ఇప్పటికే మూడు స్వ్కాడ్రన్లు డెలివరీ అయ్యాయి. మిగిలిన రెండు వచ్చే ఏడాది వచ్చే ఏడాది మధ్యకు అందుతాయి. పుతిన్ పర్యటన సందర్భంగా S-400 వాయు రక్షణ వ్యవస్థల డెలివరీలో జాప్యం గురించి భారత ప్రభుత్వం లేవనెత్తనుంది.

అమెరికా ఆంక్షల కారణంగా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురును భారత్ తగ్గించింది. దీంతో రష్యా మరిన్ని డిస్కౌంట్లను ప్రకటించింది. ఇదిలా ఉంటే, భారత్ రష్యా నుంచి 5వ తరం యుద్ధ విమానం Su-57 ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం రెండు స్క్వాడ్రన్లను కొనుగోలు చేసే విషయంపై చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల, రష్యా భారత్‌కు Su-57 ఫైటర్ జెట్ల సాంకేతికతతో పాటు భారత్‌లో తయారీని కూడా ఆఫర్ చేసింది. ఉక్రెయిన్ యుద్ధం కూడా మోడీ, పుతిన్ మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version