Site icon NTV Telugu

Pakistan: మోడీ పర్యటన ముందు పాక్‌కి రష్యా బంపర్ ఆఫర్.. అయినా ఆ దేశ దరిద్రం తెలిసిందే కదా..

Putin

Putin

Pakistan: కజకిస్తాన్ వేదికగా ఎస్‌సీఓ సమ్మిట్ జరుగుతోంది. ఈ సమ్మిట్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పుతిన్ పాకిస్తాన్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే, ఈ ఆఫర్లను పాక్ ఉపయోగించుకుంటుందా..? లేదా..? అనేది ప్రశ్న. ఒక వేళ పాకిస్తాన్, రష్యాతో వాణిజ్యం పెంచుకునే ప్రయత్నం చేస్తే అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి.

బుధవారం రోజును ఇద్దరు నేతల సమావేశం జరిగింది. పాకిస్తాన్‌కి మరింత ఎక్కువ ఇంధన సరఫరా చేసే అవకాశాలపై పుతిన్ చర్చించారు. పుతిన్ షహబాజ్‌తో మాట్లాడుతూ.. ‘‘నేను ముఖ్యంగా రెండు కీలక రంగాలను నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ఇంధనం మరియు వ్యవసాయ-పారిశ్రామిక రంగాలలో సహకారం. మేము పాకిస్తాన్‌కు ఇంధన వనరులను సరఫరా చేయడం ప్రారంభించాము మరియు ఈ సరఫరాను మరింత పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీ అభ్యర్థన మేరకు, పాక్ మార్కెట్‌కు ధాన్యం సరఫరాను పెంచడం ద్వారా పాకిస్థాన్ ఆహార భద్రతకు రష్యా మద్దతు ఇస్తోంది’’ అని బంపర్ ఆఫర్ ఇచ్చారు.

Read Also: Bihar Bridge Collapse : బీహార్‌లో 24గంటల్లోనే కూలిన మూడో వంతెన.. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న జనాలు

ఒకవేళ పాకిస్తాన్ ఈ ఆఫర్‌ని అంగీకరించినా కూడా రష్యాకు చెల్లించడానికి విదేశీ మారక నిల్వలు ఆ దేశం వద్ద లేవు. ప్రస్తుతం 8.9 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో రణాలు చెల్లింపు కారణంగా పాక్ నిల్వలు వేగంగా తగ్గతున్నాయి. ఒకవేళ పాక్ ఈ ఆఫర్ అంగీకరించా కూడా తిప్పలు తప్పేలా లేవు. ఆమెరికా ఆగ్రహం పాక్ చవిచూడాల్సి వస్తుంది.

గతేడాది జూలై నెలలో ఇలాగే ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. దీని కింద పాకిస్తాన్ రష్యా నుంచి ముడి చమురు పొందింది. భారత్‌కి ఇచ్చినట్లే డిస్కౌంట్‌పై తమకు రష్యా ఇస్తోందని పాక్ ప్రధాని ఆ దేశ ప్రజలకు చెప్పారు. అయితే, మొదటి షిప్‌మెంట్ తర్వాత, పాకిస్తాన్ ఎలాంటి ముడి చమురు అందుకోలేదు. పాకిస్తాన్‌కి రష్యా ఎలాంటి తగ్గింపు ఇవ్వలేదని తేలింది.

Exit mobile version