NTV Telugu Site icon

PM Modi-Putin: భారత్‌లో పర్యటించండి.. పుతిన్‌కి మోడీ ఆహ్వానం..

Pm Modi Putin

Pm Modi Putin

PM Modi-Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని భారత్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించినట్లుగా ఆ దేశం ప్రకటించింది. 2025లో ఈ పర్యటనకు సంబంధించిన తేదీలను నిర్ణయించనున్నట్లుగా క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉసాకోవ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పుతిన్, పీఎం మోడీ ఏడాదికి ఒకసారి సమావేశాలు నిర్వహించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని, ఈ సారి రష్యా వంతు అని భారతదేశంలోని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. ‘‘మా నాయకులు ఏడాదికి ఒకసారి సమావేశాలు నిర్వహించాలని ఒప్పందం ఉంది. ఈసారి ఇది మా వంతు’’, ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానాన్ని అందుకున్నాము, మేమే దానిని ఖచ్చితంగా సానుకూలంగా పరిశీలిస్తాము అని ఆయన వెల్లడించారు.

Read Also: IPS officer: విషాదం.. పోస్టింగ్‌కి వెళ్తుండగా యువ ఐపీఎస్ అధికారి మృతి..

2025 ప్రారంభంలో తేదీలు కనుగొంటామని అన్నారు. 2022లో ఉక్రెయిన్, రష్యా మధ్య వివాదం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌లో తొలిసారి పర్యటించబోతున్నారు. ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడానికి భారత్ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని ఇటీవల రష్యా పర్యటనలో ప్రధాని మోడీ అన్నారు. శాంతి, దౌత్యమార్గాల్లో సమస్యను ఇరు దేశాలు పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ ఏడాది, రష్యా-భారత్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు జూలైలో మోడీ మాస్కో వెళ్లారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. భారతదేశం-రష్యా సంబంధాలను పెంపొందించడంలో చేసిన కృషికి గానూ ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత జాతీయ పురస్కారం “ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్” కూడా లభించింది. అక్టోబర్ నెలలో బ్రిక్స్ సమావేశంలో కోసం మరోసారి మోడీ రష్యాలోని కజాన్‌కి వెళ్లారు. పుతిన్, మోడీల మధ్య మరోసారి సమావేశం జరిగింది.