Punjab: సీఎం మరో కీలక నిర్ణయం.. వారి భద్రత ఉపసంహరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ.. దీంతో, ఢిల్లీ పరిమితం అనుకున్న ఆ పార్టీ.. మరో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది.. ఇక, ఢిల్లీలో పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి.. పంజాబ్‌లో పరిస్థితి వేరు.. తాము ఏంటో చూపిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే అనేక సంస్కరణలు చేపడుతూ ముందుకు వెళ్తున్నారు సీఎం భగవంత్ మాన్ సింగ్.. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆప్ ప్రభుత్వం.. ఆ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా మొత్తం 184 మంది భద్రతను ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించారు ఆ రాష్ట్ర పోలీసులు.
Read Also: Sunitha: తల్లి కాబోతున్న సింగర్ సునీత..?
Also Read
ప్రభుత్వ నిర్ణయంతో తాజా మాజీ సీఎంల కుటుంబ సభ్యులతో పాటు కీలక నేతల భద్రతకు కోతపెట్టినట్టు అయ్యింది.. ప్రస్తుత పరిస్థితి, వారికి ఉన్న ముప్పు అంచనాల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్టు పంజాబ్ పోలీసులు ప్రకటించారు.. తాజాగా భద్రత తొలగించిన వారిలో మాజీ మంత్రులు బీబీ జాగీర్ కౌర్, మదన్ మోహన్ మిట్టల్, సుర్జిత్ కుమార్ రఖ్రా, సుచా సింగ్ చోటేపూర్, జనమేజా సింగ్ సెఖోన్, తోట సింగ్, గుల్జార్ సింగ్ రాణి లాంటి వారి కూడా ఉన్నారు.. ఇక, మాజీ సీఎంలు, మాజీ మంత్రుల కుటుంబ సభ్యుల సెక్యూరిటీని కూడా ఉపసంహరించుకుంది ఆప్ సర్కార్.. ఈ నిర్ణయంతో పంజాబ్ తాజా మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, మాజీ సీఎం అమరీందర్ సింగ్ కుటుంబ సభ్యులు తమ భద్రతను కోల్పోయినవారిలో ఉన్నారు..
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!