NTV Telugu Site icon

Punjab: సీఎం మరో కీలక నిర్ణయం.. వారి భద్రత ఉపసంహరణ

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్‌ ఆద్మీ పార్టీ.. దీంతో, ఢిల్లీ పరిమితం అనుకున్న ఆ పార్టీ.. మరో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది.. ఇక, ఢిల్లీలో పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి.. పంజాబ్‌లో పరిస్థితి వేరు.. తాము ఏంటో చూపిస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే అనేక సంస్కరణలు చేపడుతూ ముందుకు వెళ్తున్నారు సీఎం భగవంత్ మాన్ సింగ్‌.. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆప్‌ ప్రభుత్వం.. ఆ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా మొత్తం 184 మంది భద్రతను ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించారు ఆ రాష్ట్ర పోలీసులు.

Read Also: Sunitha: తల్లి కాబోతున్న సింగర్ సునీత..?

ప్రభుత్వ నిర్ణయంతో తాజా మాజీ సీఎంల కుటుంబ సభ్యులతో పాటు కీలక నేతల భద్రతకు కోతపెట్టినట్టు అయ్యింది.. ప్రస్తుత పరిస్థితి, వారికి ఉన్న ముప్పు అంచనాల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్టు పంజాబ్‌ పోలీసులు ప్రకటించారు.. తాజాగా భద్రత తొలగించిన వారిలో మాజీ మంత్రులు బీబీ జాగీర్ కౌర్, మదన్ మోహన్ మిట్టల్, సుర్జిత్ కుమార్ రఖ్రా, సుచా సింగ్ చోటేపూర్, జనమేజా సింగ్ సెఖోన్, తోట సింగ్, గుల్జార్ సింగ్ రాణి లాంటి వారి కూడా ఉన్నారు.. ఇక, మాజీ సీఎంలు, మాజీ మంత్రుల కుటుంబ సభ్యుల సెక్యూరిటీని కూడా ఉపసంహరించుకుంది ఆప్‌ సర్కార్.. ఈ నిర్ణయంతో పంజాబ్‌ తాజా మాజీ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ కుటుంబ సభ్యులు తమ భద్రతను కోల్పోయినవారిలో ఉన్నారు..