Site icon NTV Telugu

Covid-19: బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి.. పంజాబ్‌ సర్కారు ఉత్తర్వులు

Punjab Corona

Punjab Corona

Covid-19: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్‌ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, ఇండోర్ / అవుట్‌డోర్ సమావేశాలు, మాల్స్, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని పంజాబ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించాలని సూచించింది. ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం మాస్క్‌లు తప్పనిసరి చేసింది. ఢిల్లీ సర్కారు కూడా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలను పాటించాలని ప్రకటనలో వెల్లడించింది. కొవిడ్ లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకుని ప్రొటోకాల్‌ను అనుసరించాలని పేర్కొంది. కొవిడ్‌ పరీక్షల ఫలితాలను అప్‌లోడ్ చేయాలని అన్ని ఆస్పత్రులు, ల్యాబ్‌లు, పరీక్షా కేంద్రాలకు సూచించింది. ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్‌లను వేయించుకోవాలని పేర్కొంది.

Pesticide: వంటనూనె అనుకుని పురుగుల మందుతో వంట.. మహిళ మృతి

గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 15,815 మంది కరోనా వ్యాధి బారినపడ్డారు. అయితే కరోనా మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 68 మంది వ్యాధి బారినపడి చనిపోయారు. అయితే రికవరీ అయ్యేవారి సంఖ్య పెరిగింది. గడిచిన ఒక రోజులో 20,018 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డైలీ పాజిటివిటీ రేటు 4.36గా ఉంది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,19,264గా ఉంది.

Exit mobile version