Site icon NTV Telugu

Punjab: పాక్ ఐఎస్ఐ ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా ఆయుధాలు స్వాధీనం..

Isi

Isi

Punjab: పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ మద్దతు కలిగిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) విదేశాల నుండి నిర్వహిస్తున్న రెండు టెర్రర్ మాడ్యూల్స్‌ని పంజాబ్ పోలీసులు ఛేదించారు. ఒక మైనర్‌తో సహా 13 మందిని అరెస్ట్ చేశారు. రెండు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్(ఆర్పీజీ), ఒక రాకెట్ లాంచర్, రెండు ఐఈడీలను, హ్యాండ్ గ్రెనేడ్స్, ఆర్డీఎక్స్, పిస్టల్స్, కమ్యూనికేషన్ పరికరాలను, పెద్ద మొత్తంలో ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Read Also: RR vs LSG: మెరిసిన ఐడెన్ మార్క్రామ్, బదోని.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 181

రెండు ప్రత్యకమైన ఆపరేషన్లలో, కౌంటర్ ఇంటెలిజెన్స్ బలంధర్, బటాలా జిల్లా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లకు డీజీపీ గౌరవ్ యాదవ్ నాయకత్వం వహించారు. ఈ మాడ్యుల్స్‌ని ఫ్రాన్స్‌కు చెందిన సత్నామ్ సింగ్ అలియాస్ సత్తా, గ్రీస్‌కు చెందిన జస్వీందర్ సింగ్ అలియాస్ మన్ను అగ్వాన్ నిర్వహిస్తున్నట్లు తేలింది.

మొదటి ఆపరేషన్‌లో జగ్రూప్ సింగ్, జతీందర్ సింగ్ అలియాస్ హనీ, హర్‌ప్రీత్ సింగ్ లను అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో నిందితులు సత్నాం సింగ్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. రెండవ ఆపరేషన్‌లో, 17 ఏళ్ల బాలుడితో సహా తొమ్మిది మంది అరెస్టును బటాలా ఎస్ఎస్పీ సుహైల్ ఖాసిం మీర్ నిర్ధారించారు. అరెస్టయిన ఇతర వ్యక్తులను పవన్‌ప్రీత్ సింగ్, బల్బీర్ కుమార్ అలియాస్ వరుణ్, గోమ్జీ అలియాస్ గొట్టా, గుర్‌ప్రీత్ సింగ్ అలియాస్ గోపి, అజయ్‌పాల్ సింగ్, రాహుల్ అలియాస్ భైయా, జోహన్సన్ మరియు జతీందర్‌గా గుర్తించారు.

Exit mobile version