Punjab Allows Prisoners To Romance With Partners In Jail: జైలు జీవితం ఎలా ఉంటుందని ఖైదీలను ప్రశ్నిస్తే.. అది నరకం కన్నా దారుణంగా ఉంటుందని చెప్తారు. శతృవులకు కూడా అలాంటి గత పట్టకూడదని చెప్తుంటారు. కుటుంబ సభ్యులకు దూరంగా, నాలుగు గోడల మధ్యే గడిపే ఆ జీవితం కన్నా.. చనిపోవడమే మేలని అంటుంటారు. కానీ, ఇకపై ఆ అభిప్రాయాలు మారబోతున్నాయి. ఎందుకంటే, ఇప్పుడు ఖైదీలకు కూడా తమ భాగస్వామ్యులతో ఏకాంతంగా గడిపే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఈ పథకాన్ని దేశంలోనే తొలిసారి పంజాబ్ ప్రభుత్వం అందిస్తోంది.
జైలు ఒక గది ఉంటుంది, అందులో రెండు బెడ్రూమ్‌లో ఉంటాయి. అందులో ఖైదీలో తమ భాగస్వామితో కలిసి రెండు గంటలపాటు ఏకాంతంగా సమయం గడపొచ్చు. ఈ సమయంలో వాళ్లు శృంగారంలో కూడా పాల్గొనవచ్చు. ఇందుకు ఉచితంగా కండోమ్‌లు సైతం అందిస్తారు. ఈ విధానాన్నిసెప్టెంబరు 20న మూడు జైలుల్లో అమలు చేశారు. పంజాబ్‌లో మొత్తం 25 జైళ్లు ఉండగా.. అక్టోబరు 03 నాటికి మొత్తం 17 జైళ్లలో ఆ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఖైదీల ఒత్తిడిని తగ్గించడంతో పాటు వాళ్లు తిరిగి సమాజంలో అడుగుపెట్టేందుకు వీలుగా.. భాగస్వామ్యుల్ని సందర్శించేందుకు అనుమతి ఇచ్చామని పంజాబ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ హర్‌ప్రీత్ సిద్ధు చెప్పారు. ఇది దేశంలో దేశంలోనే మొదటిసారి అమలవుతోన్న పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పారు.
ఈ పథకం ప్రవేశ పెట్టడానికి ముందు.. సందర్శకులను ఖైదీలు నేరుగా కలుసుకునేందుకు అవకాశం ఉండేది కాదు. కేవలం ఫోన్లలో మాట్లాడుకునే వెసులుబాటు మాత్రమే ఉంటుంది. అలాగే.. ఒక ఇనుపజాలీ లేదా అద్దం స్క్రీన్ అవతల నుంచి మాత్రమే కలిసే వీలుండేది. అయితే.. పంజాబ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ కొత్త పథకం పుణ్యమా అని, ఖైదీలు తమ భాగస్వాములతో ఇకపై ఏకాంతంగా కొద్దిగా సమయం గడపొచ్చు. ఈ పథకాన్ని వినియోగించుకున్న 60 ఏళ్ల గుర్‌జీత్ సింగ్ మాట్లాడుతూ.. ఇంతకుముందు ఒంటరిగా, దిగాలుగా ఉండేవాడినని.. ఇప్పుడు ఈ పథకం రావడంతో తన భార్యతో కాసేపు ఏకాంతంగా గడిపానని, తనకు చాలా ఊరటగా ఉందని అన్నారు.
https://twitter.com/bbcnewstelugu/status/1579689726428053510?s=20&t=uLcp5cuvVqBAFyqod8cBFg