Site icon NTV Telugu

Puja Khedkar: మరోసారి వార్తల్లో పూజా ఖేద్కర్.. ఈసారి దేనికోసమంటే..!

Puja Khedkar

Puja Khedkar

మాజీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. యూపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినందుకు 2024లో ఐఏఎస్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. అనంతరం గతేడాది పూజా ఖేద్కర్ తండ్రి.. ఓ డ్రైవర్‌ను కిడ్నాప్ చేయడంతో మళ్లీ వార్తల్లో హల్‌చల్ చేశారు. తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి తమ కుటుంబ సమస్యలపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.

ఇది కూడా చదవండి: Silver Rates: వామ్మో సిల్వర్.. మళ్లీ తాండవమే! ఈరోజు ఎంత పెరిగిందంటే..!

తమ ఇంట్లో దొంగతనం జరిగిందని శనివారం పూజా ఖేద్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేపాల్ నుంచి వచ్చిన పని మనిషి.. ఆహారం, పానీయాల్లో మత్తుమందులు కలిపి ఇవ్వడంతో తన తల్లిదండ్రులు, సిబ్బంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పూణెలోని బనేర్ రోడ్ నివాసంలో పూజా ఖేద్కర్ ఇంటికి వెళ్లారు. అక్కడ వాచ్‌మెన్ జితేంద్ర సింగ్, తల్లిదండ్రులు దిలీప్, మనోరమ మంచంపై అపస్మారక స్థితిలో కనిపించారు. ఇక గదిలో అల్మారాలు, మూడు గదులు తెరిచి ఉన్నాయని.. అంతస్తుల్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ మరో దూకుడు.. వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటన

పోలీసులు వెంటనే పూజా ఖేద్కర్ తల్లిదండ్రులతో పాటు వాచ్‌మన్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ డ్రైవర్ దాదాసాహెబ్ ధకానే మరొక గదిలో ఉండగా.. వంటవాడు సుజత్ రాయ్ ఇంకొక గదిలో ఉన్నారు. వీరిని కూడా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో తాను తప్పించుకోగలిగానని.. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పూజా ఖేద్కర్ తెలిపారు. ఇక ఆమె సోదరులు వినయ్, హర్షద్ బుధ్వంత్ కూడా క్షేమంగా ఉన్నారు.

ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. పూజా ఖేద్కర్ ఆదివారం నాటికి అధికారికంగా లిఖితపూర్వక ఫిర్యాదు చేయలేదని.. ఏవేవి దొంగిలించబడ్డాయో వివరాలు అందించలేదని పోలీసులు తెలిపారు.

2024లో పూణెలో ఐఏఎస్ ప్రొబెషనర్ పిరియడ్‌లో ఉండగా పూజా ఖేద్కర్ గొంతెమ్మ కోర్కెలు కోరింది. ట్రైనింగ్ సమయంలో ఎలాంటి సదుపాయాలు ఉండవు. కానీ అంతకు మించి కోర్కెలు కోరారు. దీంతో ఆమెపై ఫిర్యాదులు వెళ్లాయి. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఉద్యోగం పొందినట్లుగా తేలడంతో యూపీఎస్సీ వేటు వేసింది. భవిష్యత్‌లో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా సస్పెన్షన్ చేసింది.

Exit mobile version