NTV Telugu Site icon

Puja Khedkar: వివాదంగా పూజా ఖేద్కర్ తండ్రి ఎన్నికల నామినేషన్.. కన్‌ఫ్యూజన్‌కు కారణమిదే!

Pujakhedkar

Pujakhedkar

వివాదాస్పద మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌కు సంబంధించిన వార్త మరోసారి హల్‌చల్ చేస్తోంది. ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. అహ్మద్‌నగర్‌లోని షెవ్‌గావ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

దిలీప్ ఖేద్కర్ ఎన్నికల అఫిడవిట్‌లో వైవాహిక స్థితిని గురించి కన్‌కఫ్యూజ్ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌కు విరుద్ధంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు భార్యతో కలిసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆమె పేరు, ఆదాయం, ఆస్తి వివరాలు తెలియజేశారు. కానీ తాజాగా దాఖలు చేసిన నామినేషన్ పత్రంలో మాత్రం విడాకులు తీసుకున్నట్లు పేర్కొ్న్నారు. ప్రస్తుతం భార్యతో ఎలాంటి వైవాహిక సంబంధాలు లేవని వెల్లడించారు. దీంతో దిలీప్ ఖేద్కర్ అఫిడవిట్ వివాదంగా మారింది.

2010లోనే విడాకులు..!
2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు దిలీప్ ఖేద్కర్ తన అఫిడవిట్‌లో తన భార్య పేరు మనోరమ ఖేద్కర్ అని పేర్కొన్నారు. ఆస్తి, ఆదాయం వివరాలు తెలియజేశారు. వాస్తవానికి వీరిద్దరికీ 2010లోనే విడాకులు మంజూరు అయినట్లు సమాచారం. దిలీప్ మరియు మనోరమ ఖేద్కర్ 2009లో పూణె ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పరస్పర అంగీకారంతో జూన్ 25, 2010న విడిపోయారు. చట్టబద్ధంగా విడిపోయినప్పటికీ పూణెలోని బానర్ ప్రాంతంలోని మనోరమా ఖేద్కర్ బంగ్లాలో ఇద్దరూ సహజీవనం కొనసాగించారు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒకలా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకలా వైవాహిక స్థితి తెలియజేయడం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతోంది. రిటర్నింగ్ అధికారి అభ్యంతరాలు వ్యక్తం చేస్తే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదలకానున్నాయి.

ఇది కూడా చదవండి: Diwali 2024: శ్రీరాముడికి హారతి ఇచ్చి దీపాలు వెలిగించిన ముస్లిం మహిళలు..

Show comments