NTV Telugu Site icon

Padma Hilsa: దుర్గా నవరాత్రి ఉత్సవాలకు బంగ్లాదేశ్ గిఫ్ట్.. “పద్మా పులస” చేపల ఎగుమతికి ఓకే..

Padma Hilsa

Padma Hilsa

Padma Hilsa: భారతీయులకు, ముఖ్యంగా బెంగాలీలకు బంగ్లాదేశ్ తీపి కబురు చెప్పింది. దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలకు బంగ్లాదేశ్ గిఫ్టు ఇవ్వబోతోంది. పద్మా పులస(పద్మా హిల్సా) చేపల ఎగుమతికి ఓకే చెప్పింది. దుర్గాపూజ సీజన్‌కి ముందు 4000 మెట్రిక్ టన్నలు హిల్సా చేపలను విక్రయించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం బుధవారం వ్యాపారులకు అనుమతి ఇచ్చింది. భారతీయ చేపల వ్యాపారుల ద్వారా ఈ రోజు రాత్రికి దేశానికి చేరుకుంటుంది.

బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చేపల దిగుమతిదారుల సంఘం పలుమార్లు అభ్యర్థించింది. పద్మా పులస చేపల దిగుమతి అక్టోబర్ 30 వరకు ఉంటుంది. ఈ చేపల్ని వారానికి రెండు మూడు దశల్లో దిగుమతి చేసుకోవచ్చు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి ఎక్కువ శాతం పులస దిగుమతి ఉంటుంది. అక్కడ నుంచి దేశంలో పలు ప్రాంతాలకు సరఫరా అవుతాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఈ పద్మా పులసను బెంగాలీలు చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాల సమయంలో ఇళ్లలో వండుకుని తింటారు. దుర్గామాతకు కొందరు నైవేధ్యంగా కూడా సమర్పిస్తారు. బెంగాల్ మార్కెట్ లో ప్రస్తుతం కిలో పద్మా పులస ధర కిలోకు దాదాపుగా వెయ్యి రూపాయలుగా ఉంది.

Read Also: JP Nadda: రాహుల్ గాంధీకి ట్యూటర్లు సాయం చేయరు.. జేపీ నడ్డా ఫైర్..

పద్మా నది బంగ్లాదేశ్ లో ప్రముఖ నది. ఈ నదిలో దొరిచే పులసలు కావడంతో ఈ చేపలకు పద్మా పులస అనే పేరు వచ్చింది. 2012లో బంగ్లాదేశ్ నుంచి పులస దిగుమతిని నిలిపేశారు. 2019లో ఇరు దేశాల మధ్య చర్చల తర్వాత మళ్లీ బంగ్లాదేశ్ నుంచి పులస దిగుమతి అవుతుంది. 2019లో 500 మెట్రిక్ టన్నుల దిగుమతికి అనుమతి ఉండగా, 2020 నాటికి 1850కి పెరిగింది. 2021లో 4600 మెట్రిక్ టన్నులకు అనుమతి లభిస్తే, కేవలం 1200 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. 2022లో 1300 మెట్రికల్ టన్నుల పులస దిగుమతి అయింది. అయితే ఈ ఏడాది 4000 మెట్రిక్ టన్నులకు అనుమతి ఉన్నప్పటికీ ఎంత వరకు దిగుమతి అవుతుందో చూడాలి.