యూజీసీ-2026 కొత్త నిబంధనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జనవరి 13న జారీ చేసిన రూల్ 3(c) ఏకపక్షంగా.. వివక్షతతో కూడిందని.. రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ అగ్ర కులాల సభ్యులు ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని యూజీసీ ప్రధాన కార్యాయలం ఎదుట నిరసనకు దిగారు. పలు రాష్ట్రాల్లో నిరసనలకు దిగారు. తక్షణమే కొత్త నిబంధనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా వేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు యూజీసీ కొత్త నిబంధన రగడ సృష్టిస్తోంది.
విద్యా సంస్థల్లో సమానత్వాన్ని ప్రోత్సహించే పేరుతో జనరల్ కేటగిరీ పట్ల యూజీసీ వివక్షను ప్రోత్సహిస్తుందని.. అంతేకాకుండా కొన్ని సమూహాలు విద్యకు దూరం కావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టులో పిటిషనర్ పేర్కొన్నాడు.
వేముల రోహిత్ ఆత్మహత్య
2026లో హైదరాబాద్ యూనివర్సిటీలో కుల వివక్ష కారణంగా వేముల రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆనాడు దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అయితే తాజాగా క్యాంపస్‌ల్లో కుల వివక్షను తొలగించేందుకు 2012 నిబంధనలను నవీకరించింది. కొత్త నియమాలు జోడించింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలు మాత్రమే కాకుండా వెనుకబడిన తరగతి విద్యార్థులు కూడా కుల వివక్ష గురించి ఫిర్యాదు చేయొచ్చని యూజీసీ పేర్కొంది. ఇప్పుడు ఈ నిబంధనే దేశ వ్యా్ప్తంగా ఆందోళనలు రేకెత్తింది. అగ్ర కులాల వారిని తప్పుడు కేసుల్లో ఇరికించి విద్యకు దూరం చేయాలని భావిస్తోందని ధ్వజమెత్తారు. ఎటువంటి పరిశీలన చేయకుండా ఎలా నిబంధనలు సడలిస్తారని మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: బెంగాల్ ఎన్నికల వేళ మమత కొత్త ఎత్తుగడ.. ఒక వర్గం ఓట్ల కోసం మాస్టర్ ప్లాన్!
అయితే వేముల రోహిత కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు.. యూజీసీకి చెందిన 2012 వివక్షత నిరోధక నియమాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. సుప్రీం ధర్మాసనం ప్రశ్నించిన నేపథ్యంలో యూజీసీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. అయితే అగ్ర కులాలకు చెందిన వారు మాత్రం తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ ప్రకంపనలు ఎటువైపు దారి తీస్తాయో చూడాలి.
ఇది కూడా చదవండి: PM Modi: భారత్-ఈయూ మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. ప్రకటించిన ప్రధాని మోడీ
