NTV Telugu Site icon

High Court: పెళ్లైనవారి ‘‘సహ జీవనం’’పై హైకోర్టు సంచలన తీర్పు.. తల్లిదండ్రుల పరవు తీస్తున్నారంటూ..

High Court

High Court

High Court: వివాహితులు ‘‘సహజీవనం’’ చేయడంపై పంజాబ్-హర్యానా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలా ‘‘లివ్ ఇన్ రిలేషన్ షిప్’’లో ఉండే వివాహితులకు రక్షణ కల్పించడం ‘‘తప్పు చేసేవారిని’’ ప్రోత్సహించడం, ద్వంద్వ వివాహాలను ప్రోత్సహించడం లాంటిదే అని కోర్టు అభిప్రాయపడింది. తల్లిదండ్రుల నుంచి ఇళ్ల నుంచి పారిపోయే ఇలాంటి జంటలు తమ కుటుంబాలకు చెడ్డపేరు తీసుకురావడమే కాకుండా, గౌరవంగా జీవించే తల్లిదండ్రుల హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారని జస్టిస్ సందీప్ మౌద్గిల్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

40 ఏళ్ల మహిళ, 44 ఏళ్ల పురుషుడు తమ కుటుంబాల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయనే కారణంగా తమకు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌‌తో సహా అనేక పిటిషన్లపై కోర్టు ఈ ఆదేశం ఇచ్చింది. సదరు వ్యక్తికి అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లులు ఉన్నప్పటికీ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళ తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. పిటిషన్ దాఖలు చేసినవారికి ఇంతకు ముందే పెళ్లైందనే విషయం తెలుసని, వారు సహజీవనంలోకి ప్రవేశించకూడదని వారికి అవగాహన ఉందని కోర్టు అభిప్రాయపడింది. సహజీవనంలో ఉన్న పురుషుడు తన భార్య నుంచి ఇంకా విడాకులు తీసుకోలేదని చెప్పింది. అన్ని సహజీవనాలు వివాహ స్వభావాన్ని కలిగి ఉండవని కోర్టు పేర్కొంది.

పిటిషనర్ల మధ్య ఉన్న సంబంధం వివాహ సంబంధంగా కోర్టు భావిస్తే, అది పురుషుడి భార్య, పిల్లలకు అన్యాయం చేసినట్లే అని కోర్టు పేర్కొంది. వివాహం అనేది ప్రజా ప్రాముఖ్యత కలిగిన సంబంధమని కోర్టు చెప్పింది. వివాహం అనేది కుటుంబ వ్యవస్థ భద్రతను అందించే సామాజిక విషయమని, పిల్లల పెంపకంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, వివాహం అనేది నైతిక మరియు చట్టబద్దమైన బాధ్యతలకు దారి తీస్తుందని, ముఖ్యంగా భార్యాభర్తలకు మద్దతు ఇవ్వడం, వివాహం నుంచి జన్మించిన పిల్లలకు మద్దతు ఇవ్వడం, పెంచడం వారి ఉమ్మడి బాధ్యత అని కోర్టు చెప్పింది.

Read Also: Nitish kumar: నీతి అయోగ్ సమావేశానికి నితీష్ కూడా డుమ్మా? సర్వత్రా చర్చ

‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, ప్రతి వ్యక్తికి శాంతి, గౌరవం మరియు గౌరవంతో జీవించే హక్కు ఉంది, కాబట్టి అలాంటి పిటిషన్లను అనుమతించడం ద్వారా, మేము తప్పు చేసిన వారిని ప్రోత్సహిస్తున్నాము మరియు ఎక్కడో పెద్ద భార్యాభర్తల ఆచారాన్ని ప్రోత్సహిస్తున్నాము. సెక్షన్ 494, IPC కింద నేరం, ఆర్టికల్ 21 ప్రకారం ఇతర జీవిత భాగస్వామి మరియు పిల్లలు గౌరవంగా జీవించే హక్కును మరింత ఉల్లంఘించడం.’’ అని కోర్టు పేర్కొంది.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద హామీ ఇవ్వబడిన జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ అనే భావన గౌరవంగా జీవించే హక్కును కలిగి ఉందని, మహిళ-పురుషుడు ఇంటి నుంచి పారిపోయి కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురావడమే కాకుండా, తల్లిదండ్రులు గౌరవంగా జీవించే హక్కును ఉల్లంఘించారని కోర్టు చెప్పింది. ఇలాంటి వారికి పోలీసుల రక్షణ కల్పించడం అక్రమ సంబంధానికి పరోక్షంగా సమ్మతి తెలియజేయడమే అని చెప్పింది.

భారతదేశం విభిన్నమైన సూత్రాలు, సంప్రదాయాలు, ఆచారాలు మరియు నమ్మకాలను కలిగి ఉన్న దేశమని, అవి అవసరమైన చట్టపరమైన మూలాలుగా పనిచేస్తాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. వివాహం అనేది చట్టపరమైన పరిణామాలు, గొప్ప సామాజిక గౌరవంతో కూడి పవిత్ర బంధమని, మనదేశం వివాహం యొక్క లోతైన సాంస్కృతిక మూలాలతో, నైతికత, నైతిక తార్కికానికి గణనీయమైన ప్రాధాన్యత ఇస్తుందని కోర్టు చెప్పింది. ఇటీవల కాలంలో భారతీయ సంస్కృతికి భిన్నమైన పాశ్చాత్య సంస్కృతిని స్వీకరించడం ప్రారంభామని, కొంతకాలంగా ఆధునిక జీవన శైలి, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లను అవలంభిస్తోందని కోర్టు పేర్కొంది.