NTV Telugu Site icon

Wayanad: కేరళ చేరుకున్న కాంగ్రెస్ అగ్ర నేతలు.. రేపు ప్రియాంక నామినేషన్

Coeke

Coeke

కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కేరళ చేసుకున్నారు. అక్కడ నుంచి కేరళ వెళ్లనున్నారు. రాష్ట్ర నాయకులు భారీ స్వాగతం పలికారు. బుధవారం వయనాడ్‌లో ప్రియాంకాగాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. భారీ ర్యాలీగా బయల్దేరి వెళ్లి వయనాడ్ కలెక్టరేట్‌లో ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక ప్రియాంకపై బీజేపీ కూడా గట్టి అభ్యర్థినే రంగంలోకి దింపింది. నవ్య హరిదాస్‌ను కమలనాథులు పోటీకి దింపారు.

ఇది కూడా చదవండి: Sangareddy: ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్తో దూసుకెళ్తున్న ఉన్నతాధికారుల వాహనాలు..

గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి భారీ విజయంతో గెలుపొందారు. కుటుంబానికి కంచుకోట అయిన రాయ్‌బరేలీ స్థానాన్ని ఉంచుకుని వయనాడ్‌ను వదులుకున్నారు. దీంతో వయనాడ్‌లో బైపోల్ వచ్చింది. ముందుగానే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే.. వయనాడ్‌లో ప్రియాంక పోటీ చేస్తుందని ప్రకటించారు. అన్నట్టుగానే ఆమె పేరును ప్రకటించారు. ఇక నవంబర్ 13న వయనాడ్‌లో ఉపఎన్నిక జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: Israel Hezbollah War: హిజ్బుల్లా బంకర్‌లో 500 మిలియన్ డాలర్ల డబ్బు, బంగారం.. ఆయువుపట్టుపై ఇజ్రాయిల్ దెబ్బ..