NTV Telugu Site icon

Priyanka Gandhi: ‘‘జమాతే ఇస్లామీ మద్దతుతో పోటీ చేస్తోంది’’.. పినరయి వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంకాగాంధీ..

Priyanka Gandhi

Priyanka Gandhi

Priyanka Gandhi: ప్రియాంకా గాంధీ వయనాడ్ ఎన్నికల్లో పోటీపై ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మతతత్వ సంస్థ ‘‘జమాతే ఇస్లామీ’’ మద్దతుతో ఆమె వయనాడో‌లో పోటీ చేస్తుందని విజయన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆదివారం ప్రియాంకా గాంధీ స్పందించారు. “అభివృద్ధి వంటి వాస్తవ విషయాలపై రాజకీయ నేతలు మాట్లాడాలి. వాయనాడ్‌కు వారు ఏమి చేసారు? దాని గురించి మాట్లాడాలి. ధరల పెరుగుదల, అభివృద్ధి, నిరుద్యోగం వంటి ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై ఎన్నికలు జరగాలి. మనం ప్రజలను మభ్యపెట్టకూడదు.”అని ఆమె అన్నారు.

Read Also: Hyundai Aura: కారు కొనాలనే వారికి శుభవార్త.. రూ. 43000 భారీ డిస్కౌంట్

వయనాడ్ ఉప ఎన్నికల్లో ‘‘కాంగ్రెస్ పార్టీ లౌకిక ముసుగు పూర్తి బట్టబయలైంది. ’’ అని ఇటీవల విజయన్ తన ఫేస్‌బుక్ పోస్టులో విమర్శించారు. “ప్రియాంక గాంధీ అక్కడ జమాతే ఇస్లామీ మద్దతుతో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి, కాంగ్రెస్ వైఖరి ఏమిటి? మన దేశానికి జమాతే ఇస్లామీ గురించి తెలియనిది కాదు. ఆ సంస్థ సిద్ధాంతం ప్రజాస్వామ్య విలువలతో సరిపోతుందా?, లౌకికవాదం కోసం నిలబడే వారు అన్ని రకాల మతోన్మాదాలను వ్యతిరేకించకూడదా?’’ అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ జమాతే ఇస్లామీ సంస్థను తిరస్కరించగలదా..? ముస్లిం లీగ్‌తో సహా కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు జమాతే ఇస్లామీ పొత్తు కోసం త్యాగాలు చేస్తున్నాయని, జమాతే ఇస్లామీ ఓట్లను కాంగ్రెస్ తిరస్కరించగలదా..? అని సవాల్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ, వయనాడ్‌కి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. వయనాడ్ స్థానం నుంచి కాంగ్రెస్ ప్రియాంకా గాంధీని నిలబెట్టింది. బీజేపీ నుంచి నవ్య హరిదాస్, లెఫ్ట్ కూటమి నుంచి సత్యేన్ మొకేరి వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. నవంబర్ 13న ఎన్నికలు జరగనున్నాయి.

Show comments