Priyanka Gandhi: ‘‘ అత్యాచార నిందితులకు మద్దతు’’.. ప్రహ్లాద్ జోషిపై ప్రియాంకాగాంధీ సంచలన వ్యాఖ్యలు..

  • యాంటీ పేపర్ లీక్ బిల్లుపై పార్లమెంట్‌లో ప్రియాంక గాంధీ ఘాటు విమర్శలు.
  • ప్రధాని మోదీ "కెమెరా యాంగిల్ కాదు, మనసు యాంగిల్ మార్చుకోవాలి" అని వ్యాఖ్య.
  • ప్రహ్లాద్ జోషిపై అత్యాచార కేసుకు సంబంధించిన ఆరోపణలు.
  • ప్రియాంక వ్యాఖ్యలను కిరెన్ రిజిజు తీవ్రంగా ఖండించారు.
Priyanka Gandhi

Priyanka Gandhi

Priyanka Gandhi: యాంటీ పేపర్ లీక్ బిల్లుపై పార్లమెంట్‌లో వాడీవేడి చర్చ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ, విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గర్భవతిపై అత్యాచారం చేసిన నిందితుల్ని ఆయన సమర్థించారని ఆరోపించారు. అత్యాచార నిందితులకు బెయిల్ వస్తే ఆయన ఆనందించారని అన్నారు. కోట్లాది మంది మహిళలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అయితే, ఈ వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు తీవ్రంగా ఖండించారు. ప్రియాంకా గాంధీ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.

ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీపై కూడా ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని కెమెరా యాంగిల్ కాదు, మనసు యాంగిల్ మార్చుకోవాలని అన్నారు. ఇన్‌స్టాగ్రామ్ క్లిప్ కోసం కెమెరా యాంగిల్ మార్చినంత మాత్రాన జెన్ జీ నమ్మకాన్ని గెలుచుకోలేరని అన్నారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఏకే -47, పెల్లెట్ గన్స్ కాల్చుమని ఎవరు ఆదేశించారని ప్రధాని మోడీని, అమిత్ షాను ప్రశ్నించారు.