PM Modi-Adani Bag: ఈ రోజు (డిసెంబర్ 10) పార్లమెంటుకు వచ్చిన వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఒక చమత్కారమైన బ్యాగ్‌ని తీసుకెళ్లారు. ఆ బ్యాగ్‌పై ఒక వైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీల ఫోటోలు ఉండగా.. మరోవైపు మోడీ- అదానీ భాయ్ భాయ్ అనే నినాదంతో కూడిన డిజైన్ బ్యాగ్ ను ఆమె తీసుకెళ్లారు.
Read Also: WTC Final: డబ్ల్యూటీసీ రేసులో వెనుకబడ్డ భారత్.. అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా
ఇక, ఈ బ్యాగ్‌ని చూసిన కాంగ్రెస్ సీనియన్ నేత, లోక్ సభలో ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ ఆనందించారు. వీరి ఇరువురి మధ్య జరిగిన సంభాషణ సమయంలో దాన్ని పట్టుకుని.. ఇది చాలా అందంగా ఉంది అని చెప్పుకొచ్చారు. మొదట్లో మోడీ- అదానీ చిత్రం ఉన్న ఫ్రంట్ డిజైన్‌ను చెక్ చేసి.. వెనుక వైపు ఉన్న నినాదాన్ని చదవడానికి దాన్ని తిప్పాడు.. ఆ నినాదాన్ని చూడగానే, రాహుల్ గాంధీ నవ్వుతూ.. ఇది ఎంత ముద్దుగా ఉందో చూడండి అని ఇండియా కూటమి నేతలకు చూపించారు. ఆ బ్యాగ్ డిజైనర్ గురించి కూడా ప్రియాంకను రాహుల్ అడగడంతో ఆమె కూడా నవ్వుతూ ముందుకు కొనసాగింది.
See LoP @RahulGandhi Ji’s reaction when he noticed the unique bag of Smt. @priyankagandhi Ji with the slogan ‘Modi Adani Bhai Bhai’ and asked,
‘Who designed that?’ pic.twitter.com/CWDNfrx0Ya
— Saral Patel (@SaralPatel) December 10, 2024