Site icon NTV Telugu

Priyanka Gandhi: రాహుల్ గాంధీ రికార్డును బ్రేక్ చేసిన ప్రియాంకా.. వయనాడ్ లో ఘన విజయం

Priyanka

Priyanka

Priyanka Gandhi: కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ లోక్ సభ ఉప ఎన్నిక‌ల్లో సరికొత్త రికార్డు న‌మోదైంది. కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ.. అత్యధిక మెజారిటీతో విజ‌యాన్ని న‌మోదు చేసింది. గ‌తంలో ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె సోద‌రుడు రాహుల్ గాంధీ సుమారు 3 లక్షల 65 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, రాహుల్ రాజీనామాతో ఆ స్థానం నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన ప్రియాంకా గాంధీ.. ఈ ఉప ఎన్నిక‌లో విజయం సాధించారు.

Read Also: Damodar Raja Narasimha: ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర టెలీ కాన్ఫరెన్స్‌..

ఇక, రాహుల్ గాంధీ మెజారిటీని ఇప్పటికే ప్రియాంక గాంధీ దాటేసింది. తాజాగా.. ప్రియాంకా 4 లక్షల 3 వేల 966 ఓట్ల మెజారిటీ సాధించారు. ప్రియాంకాకు 5.78 లక్షల ఓట్లు పోల‌వ్వగా.. సెకండ్ ప్లేస్ లో క‌మ్యూనిస్టు అభ్యర్థి సత్యన్ మోక‌రి ఉండగా.. ఇక, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి న‌వ్య హ‌రిదాస్ 10 వేల ఓట్లతో మూడ‌వ స్థానంలో కొనసాగారు.

Exit mobile version