Raghav Chadha: ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్ధాకు పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. రాజ్యసభ ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎంపీకి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. తమ సంతకాలను ఫోర్జరీ చేశారని రాజ్యసభలో నలుగురు ఎంపీలు చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ ప్రివిలేజ్ కమిటీ ఎంపీకి నోటీసులు ఇచ్చింది. నలుగురు ఎంపీలు చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
Read also: Poultry Farm: కోళ్ల ఫారం పెట్టాలనుకుంటున్నారా?.. ఇది మీ కోసమే..
నిబంధనలను ఉల్లంఘించి తమ అనుమతి లేకుండా హౌస్ ప్యానెల్‌కు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తమ పేర్లను ప్రతిపాదించారని ఆరోపించిన నలుగురు ఎంపీల ఫిర్యాదులను రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ బుధవారం పరిశీలించి.. దర్యాప్తు చేసేందుకు ప్రివిలేజెస్ కమిటీకి సూచించారు. తమ అనుమతి లేకుండా తమ పేర్లతో సహా ఇతర వ్యక్తుల ప్రత్యేక హక్కులను చద్దా ఉల్లంఘించారని ఎంపీలు సస్మిత్ పాత్ర, ఎస్ ఫాంగ్నాన్ కొన్యాక్, ఎం తంబిదురై మరియు నరహరి అమీన్‌ల నుండి చైర్మన్‌కు ఫిర్యాదులు అందాయని రాజ్యసభ బులెటిన్‌లో పేర్కొంది. ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2023’ను పరిగణనలోకి తీసుకునేందుకు సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని చద్దా ప్రతిపాదించారు. అందులో నలుగురు ఎంపీల పేర్లను చేర్చారు.
రాజ్యసభ ఛైర్మన్, రాజ్యసభ, రాష్ట్రాల కౌన్సిల్ (రాజ్యసభ)లో విధివిధానాలు మరియు పార్లమెంట్ బిజినెస్ రూల్ 203 కింద ఈ విషయాన్ని పరిశీలించి, దర్యాప్తు చేసి నివేదిక కోసం ప్రివిలేజెస్ కమిటీకి పంపారని రాజ్యసభ బులెటిన్ పేర్కొంది. సెలెక్ట్ కమిటీకి పంపాలని సంతకాలు ఉన్న నలుగురు ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఆ సంతకాలు చేయలేదని.. తమ సంతకాలను చద్దా ఫోర్జరీ చేశారని ఆరోపించారు. ఈ అంశంపై విచారణకు ఛైర్మన్ ఆదేశించారు. ఎంపీల ఫిర్యాదు అంశంపై చర్చించేందుకు బుధవారం ప్రివిలేజ్ కమిటీ సమావేశం అయింది. సమావేశంలో ఎంపీ రాఘవ్ చద్ధాకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించడంతో .. సమావేశం అనంతరం ప్రివిలేజ్ కమిటీ రాఘవ్ చద్దాకు నోటీసులను జారీ చేసింది.
